పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-207-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శ్వత్ప్రశాంతు నభయుని
విశ్వాత్ముఁ బ్రబోధమాత్రు విభు సంశుద్ధున్
శాశ్వతు సము సదసత్పరు
నీశ్వరుఁ జిత్తమున నిలుపు మెపుడు మునీంద్రా!

టీకా:

శశ్వత్ ప్రశాంతున్ = భగవంతుని {శశ్వత్ప్రశాంతుడు - శాశ్వతమైన ప్రశాంతి కలవాడు, భగవంతుడు}; అభయునిన్ = భగవంతుని {అభయుడు - భయము లేని వాడు, భగవంతుడు}; విశ్వాత్ము = భగవంతుని {విశ్వాత్ముడు - విశ్వమునకు ఆత్మ ఐనవాడు, పరమాత్మ, విశ్వమే శరీరముగా కలవాడు, భగవంతుడు}; ప్రబోధమాత్రున్ = భగవంతుని {ప్రబోధమాత్రుడు - జ్ఞానముచే మాత్రమే తెలియబడువాడు, భగవంతుడు}; విభున్ = భగవంతుని {విభుడు - ప్రభువు, భగవంతుడు}; సంశుద్ధున్ = భగవంతుని {సంశుద్ధుడు - పరిశుద్ధమైన వాడు}; శాశ్వతున్ = భగవంతుని {శాశ్వతుడు - శాశ్వతముగ ఉండు వాడు, భగవంతుడు}; సమున్ = భగవంతుని {సముడు - సమస్తమున సమముగ చూచువాడు}; సదసత్పూరుషున్ = భగవంతుని {సదసత్పూరుషుడు - సత్ లోను అసత్ లోనూ నివసించు వాడు, భగవంతుడు}; ఈశ్వరున్ = భగవంతుని {ఈశ్వరుడు - ప్రభువు, భగవంతుడు}; చిత్తమున = మనసులో; నిలుపుము = నిలుపుకొనుము; ఎపుడున్ = ఎల్లప్పుడును; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠుడా (నారదుడా).

భావము:

నారదమునీశ్వర! ఎల్లవేళల మిక్కిలి శాంతుడై వుండేవాడు, భయరహితుడు, విశ్వమయుడు, కేవల జ్ఞానస్వరూపుడు, సర్వేశ్వరుడు, శుద్ధాత్ముడు, శాశ్వతుడు, సముడు, సత్తు అసత్తులకు అతీతుడు అయినట్టి పరమేశ్వరుణ్ణి సదా నీ హృదయంలో ప్రతిష్ఠించుకో.