పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-204.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లార్ష్ణిషేణాదులైన మహాత్ము లెలమిఁ
విలి యద్దేవు భక్తిఁ జిత్తముల నిల్పి
త్పరాయణు లౌట దుర్దాంతమైన
విష్ణుమాయఁ దరింతురు విమలమతులు.

టీకా:

గాధి = గాధి {గాధి - విశ్వామిత్రుని వంశమునకు మూల పురుషుడు}; గయ = గయాసురుడు {గయాసురుడు - గయాక్షేత్రము ఇతని శరీరమున నిర్మింపబడి యందు పితృదేవతలు తరించుచున్నారు}; ఆదులు = మొదలగువారు; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుడు {ఇక్ష్వాకుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు}; దిలీప = దిలీపుడు {దిలీపుడు - సూర్య వంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు, ఇతని మునిమనవడు దశరథుడు}; మాంధాతలున్ = మాంధాతలును {మాంధాత - సూర్యవంశపు చక్రవర్తి}; భీష్మ = భీష్ముడు {భీష్ముడు - కురువృద్దుడు - భీష్మ ప్రతిజ్ఞ చేసిన కురువంశ మహాపురుషుడు}; యయాతి = యయాతి {యయాతి - చంద్రవంశపు రాజు, ఇతని కొడుకు యదువు. అతని వంశము వారు యాదవులు}; సగర = సగరుడు {సగరుడు - సూర్యవంశపు మహారాజు, ఇతని పుత్రులు తవ్వగ నేర్పడినదే సాగరము}; రఘు = రఘువు {రఘువు - సూర్య వంశపు మహారాజు దిలీపుని పుత్రుడు}; ముచుకుంద = ముచుకుందుడు {ముచుకుందుడు - మునీశ్వరుడు, కాలయవనుని మరణ కారకుడు}; ఐళ = ఐళుడు {ఐళుడు - ఇల యొక్క పుత్తుడు}; రంతిదేవ = రంతిదేవుడు {రంతిదేవుడు - మహాదానశీలి, ఇతని దానశీల మహత్యమే వలన ముంగిసకు బంగారు శరీరము వచ్చినది}; ఉద్ధవుడు = ఉద్ధవుడు {ఉద్ధవుడు - కృష్ణునికి తండ్రి వరుసైన వాడు}; సారస్వత = సారస్వతుడు; ఉదంక = ఉదంకుడు {ఉదంకుడు - పరమ భాగవతుడు, పైల మహర్షి శిష్యుడు, ముందు చాలాకాలము తక్షకునిపై పగబట్టి జనమేజయునిచే సర్పయాగము చేయించెను}; భూరిషేణుడు = భూరిషేణుడు; శ్రుతదేవ = శ్రుతదేవుడు; మారుతి = ఆంజనేయుడు {ఆంజనేయుడు - పరమ భాగవతుడు, భగవంతుని సేవయే కాని తనకు కావలసిన దేమియును లేని మొదటి భక్తుడు}; శతధన్వ = శతధన్వుడు; పిప్పల = పిప్పలుడు {పిప్పలుడు - పిప్పలాచార్యుడు తత్వశాస్త్రవేత్త}; బలి = బలి చక్రవర్తి {బలి చక్రవర్తి - వామనునకు దానమిచ్చిన మహాదాలశీలి}; విభీషణ = విభీషణుడు {విభీషణుడు - రావణాసురుని తమ్ముడు, రామునకు శరణాగతి యైనవాడు}; శిబి = శిబి చక్రవర్తి {శిబి చక్రవర్తి - కపోతరూపుని కిచ్చిన శరణము కొరకు తన కండలు కోసి ఇచ్చినవాడు}; పార్థ = పార్థుడు {పార్థుడు - పృథ కొడుకు, అర్జునుడు}; విదురులు = విదురుడు {విదురుడు - యమధర్మ రాజు అవతారము, కురు పాండవుల పినతండ్రి}; అంబరీష = అంబరీషుడు {అంబరీషుడు - అథిధి సత్కారమున శ్రేష్ఠుడు, సాధు వర్తనమున దూర్వాసుని గెలిచినవాడు}; పరాశర = పరాశరుడు {పరాశరుడు - వ్యాసుని తండ్రి}; అలర్క = అలర్కుడు {అలర్కుడు - దత్తాత్రేయుని శిష్యుడు, యోగవిద్య ఉపదేశము పొందినవాడు}; దేవల = దేవలుడు; సౌభరి = సౌభరి; మిథిలేశ్వర = జనకుడు {మిథిలేశ్వరుడు - జనక మహారాజు, సీతాదేవి తండ్రి}; అభిమన్యు = అభిమన్యువు {అభిమన్యువు - ఇతడు అర్జునుని పుత్రుడు కాదు, ఇంకా పూర్వపు రాజు}; ఆర్ష్ణిషేణ = ఆర్ష్ణిషేణుడు; ఆదులు = మొదలగువారు; ఐన = అయిన;
మహాత్ములు = గొప్పవారు; ఎలమిఁన్ = వికాసముతో; తవిలి = మనసున లగ్నముచేసికొని; ఆ = ఆ; దేవుని = భగవంతుని; భక్తిఁన్ = భక్తితో; చిత్తములన్ = మనసులలో; నిల్పి = నిలుపుకొని; తత్ = దాని యందే; పరాయణులు = లగ్నమైనవారు; ఔటన్ = అగుటచేత; దుర్దాంతము = దమించుటుకు రానిది; ఐన = అయిన; విష్ణు = విష్ణువు యొక్క; మాయఁన్ = మాయను; తరింతురు = తరించెదరు; విమల = నిర్మలమైన; మతులు = బుద్ధి కలవారు.

భావము:

గాధి, గయుడు మొదలైనవారు, ఇక్ష్యాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘు మహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, శ్రుతదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబిచక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశరమహర్షి, అలర్క మహారాజు, దేవలుడు, సౌభరి, జనకమహారాజా, అభిమన్యుడు, ఆర్ష్ణిషేణుడు మొదలగు నిర్మలమతులైన మహాత్ములందరూ అనురక్తులై భక్తితో ఆ దేవదేవుని తమ మనస్సులో నిల్పారు. ఆయనే గతి అని సేవించారు. అందువల్లనే దాట వీలుగాని విష్ణుమాయను దాటగలవారయ్యారు.