పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : భాగవత వైభవంబు

  •  
  •  
  •  

2-202-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రముమాని తన్ను మది నెంతయు నమ్మి భజించువారి నా
శ్రిజన సేవితాంఘ్రి సరసీరుహుఁడైన సరోజనాభుఁ డం
చిదయతోడ నిష్కపటచిత్తమునం గరుణించు; నట్టివా
తుల దురంతమై తనరు వ్విభు మాయఁ దరింతు రెప్పుడున్.

టీకా:

ఇతరము = మిగిలినవి అన్నిటిని; మాని = వదలి; తన్నున్ = తనను; మదిన్ = మనస్ఫూర్తిగా; ఎంతయున్ = ఎంతో, చాలా; నమ్మి = నమ్మి; భజించు = సేవించు; వారిన్ = వారిని; ఆశ్రిత = ఆశ్రయించిన; జన = జనులచే; సేవిత = సేవింపబడు; అంఘ్రి = పాదములు అను; సరసీరుహుఁడు = పద్మములు కలవాడు; ఐన = అయినట్టి; సరోజ = పద్మ; నాభుఁడు = నాభుడు (విష్ణువు); అంచిత = పూజనీయమైన; దయ = కరుణ; తోడన్ = తో; నిష్కపట = కపటములేని; చిత్తమునున్ = మనస్సును; కరుణించున్ = దయచేయును; అట్టి = అటువంటి; వారలు = వారు; అతుల = సాటిలేని; దురంతము = తెలియరానిది {దురంతము - అంతమును చూచుటకు కష్టమైనది}; ఐ = అయి; తనరున్ = విస్తరించునట్టి; ఆ = ఆ; విభుని = ప్రభువు; మాయఁన్ = మాయను; తరింతురు = దాటుదురు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును.

భావము:

ఎవరు ఇతర చింతలు మాని సదా శ్రీమన్నారాయణుణ్ణే దృఢంగా నమ్మి సేవిస్తారో, వాళ్లను, ఆశ్రితులు అర్చించే పాదపద్మాలు కలవాడైన పద్మనాభుడు మిక్కిలి దయగలిగి, కల్లాకపటంలేని మనస్సుతో అనుగ్రహిస్తాడు. అలా భగవంతుని సేవించి ఆయన కృపకు పాత్రులైనవాళ్లు మాత్రమే సాటిలేనిది, దాటరానిది అయిన ఆ భగవంతుని మాయను నిరంతరం తరింపగలుగుతారు.