పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-193-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి లోకోత్కృష్టుండైన కృష్ణుని యవతారమహాత్యం బెఱింగించితి నింక వ్యాసావతారంబు వినుము.

టీకా:

అట్టి = అటువంటి; లోక = లోకములకు; ఉత్కృష్టుండు = ఉత్తమమైన వాడు; ఐన = అయిన; కృష్ణుని = కృష్ణుని; అవతార = అవతార; మహాత్యంబున్ = గొప్పతనమును; ఎఱింగించితిన్ = తెలియజేసితిని; ఇంకన్ = ఇంక; వ్యాస = వ్యాసుని; అవతారంబున్ = అవతారమును; వినుము = వినుము.

భావము:

అటువంటి సర్వలోకశ్రేష్ఠుడైన శ్రీకృష్ణుని అవతారాన్ని ప్రభావాన్ని చెప్పాను. మరిక వ్యాసావతారం చెప్తాను వినుము.