పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-190-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

క మురప్రలంబ యవద్విప ముష్టికమల్ల కంసశం
శిశుపాల పంచజన పౌండ్రక పల్వల దంతవక్త్ర వా
ఖర సాల్వ వత్స బక నాగ విదూరథ రుక్మి కేశి ద
ర్దు వృష ధేనుక ప్రముఖ దుష్ట నిశాటులఁ ద్రుంచె వ్రేల్మిడిన్.

టీకా:

నరక = నరకాసురుడు {నరకాసురుడు - భూమాత పుత్రుడు, సత్యభామ చేత హతుడు అయిన అసురుడు}; ముర = ముర {ముర - ముర అను అసురుడు వీనిని సంహరించి కృష్ణుడు మురారి అను పేరు బడెను}; ప్రలంబ = ప్రలంబుడు {ప్రలంబుడు - ఒక అసురుడు}; యవన = కాల యవనుడు {కాలయవనుడు - కృష్ణనిచే ప్రేరేపితుడై అతని0 వెన్నంటి ముని చూపు వలని అగ్నిలో మరణించినవాడు}; ద్విప = ద్విప అను మదపుటేనుగు {ద్విప - కంసుని ఆస్థానమందలి మదపుటేనుగు, రెంట త్రావుడు, 2 రకముల తాగునది}; ముష్టిక = ముష్టికుడు {ముష్టికుడు - కంసుని ఆస్థాన మల్లయోధుడు}; మల్ల = మల్లుడు {మల్లుడు - కంసుని ఆస్థాన మల్లయోధుడు}; కంస = కంసుడు {కంసుడు - కృష్ణని మేనమామ}; శంబర = శంబరుడు {శంబరుడు - ఒక అసురుడు}; శిశుపాల = శిశుపాలుడు {శిశుపాలుడు - కృష్ణుని మేనల్లుడు}; పంచజన = పంచజనుడు {పంచజనుడు - కృష్ణుడు పంచజనుని చంపి అతని నుండి పాంచజన్యము అను శంఖమును ధరించెను}; పౌండ్రక = పౌండ్రక వాసుదేవుడు {పౌండ్రక వాసుదేవుడు - పౌండ్రక దేశ అధిపతి తనే వాసుదేవుని అసలు అవతారమని విఱ్ఱవీగినవాడు}; పల్వల = పల్వలుడు {పల్వలుడు - ఇల్వలుడు అను రాక్షసుని కొడుకు పల్వలుడు, బలరాముడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మునుల కోరిక మేర పల్వలుని సంహరించాడు}; దంతవక్త్ర = దంతవక్త్రుడు {దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు}; వానర = వానరుడు {వానరుడు – వానర రూపమున వచ్చి పాచికలాడుతున్న బలరాముని చికాకు పరచిన అసురుడు}; ఖర = ఖరుడు {ఖరుడు - గాడిదరూపి అసురుడు}; సాల్వ = సాల్వుడు {సాల్వుడు - సాల్వ దేశ రాజు}; వత్స = వత్సాసురుడు {వత్సాసురుడు - గోవత్స రూపమున బాలకృష్ణుని అలమందలో చేరిన అసురుడు}; బక = బకాసురుడు {బకాసురుడు - అతి పెద్ద బకము (కొంగ) రూపమున బాల కృష్ణుని వధించవచ్చిన వాడు}; నాగ = ఆఘాసురుడు {నాగ - పాము రూపమున వచ్చిన అఘాసురుడు}; విదూరథ = విదూరథుడు; రుక్మి = రుక్మి {రుక్మి - రుక్మిణి అన్న గారు}; కేశి = కేశి {కేశి - కంశుని తమ్ముడు, భీకర గుఱ్ఱము రూపంలో వచ్చి కృష్ణునిచే సంహరింపబడినవాడు}; దర్దుర = దర్దురుడు; వృష = వృషభాసురుడు {వృషభాసురుడు - ఎద్దు రూపమున ఉన్న వృషభాసురుడు}; ధేనుక = ధేనుకుడు {ధేనుకాసురుడు - గాడిద రూపమున ఉన్న ధేనుకాసురుడు}; ప్రముఖ = మొదలైన ప్రముఖ; దుష్ట = దుష్టులైన; నిశాటులఁన్ = రాక్షసులను {నిశాటులు - నిశ (చీకటి, చెడు) లో ప్రవర్తించు వారు}; త్రుంచెన్ = సంహరించెను; వ్రేల్మిడిన్ = చిటికెలో.

భావము:

ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుడు, మురాసురుడు, ప్రలంబుడు, కాలయవనుడు, కువలయాపీడము అనే ఏనుగు, ముష్టికుడు చాణూరుడు మొదలైన మల్లురు, కంసుడు, శంబరుడు, శిశుపాలుడు, పౌండ్రక వాసుదేవుడు, పల్వలుడు, దంతవక్ర్తుడు, ద్వివిదుడు అనే వానరుడు, గర్దభాసురుడు, సాల్వుడు, వత్సాసురుడు, బకాసురుడు, విదూరథుడు, రుక్మి, కేశి, దర్దురుడు, వృషభాకారాలు గల ఏడుగురు దనుజులు, ధేనుకుడు మొదలైన పెక్కుమంది రక్కసులను ఒక్క త్రుటిలో రూపుమాపాడు.
(భూభారం ఉడుపుటకైన వీరందరి సంహారముల కారకుడు కృష్ణుడే అని తాత్పర్యముగా గ్రహించనోపును.)