పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : గోవర్థనగిరి ధారణంబు

  •  
  •  
  •  

2-188.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళలు జాతులు మూర్ఛనల్ లుగ వేణు
నాళ వివరాంగుళన్యాస లాలనమున
హితగతిఁ బాడె నవ్యక్త ధురముగను
పంకజాక్షుండు దారువు లంకురింప.
సప్తస్వరాలు - అనుయుక్తాలు

టీకా:

సాంద్ర = చిక్కటి; శరత్ = శరత్కాల, శరదృతువు; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెలల; ధవళిత = తెల్లనైన; విమల = నిర్మలమైన; బృందావన = బృందావనము యొక్క {బృందావనము - బృందము ఆవనము (రక్షించుట), బృంద (తులసి) వనము (తోట)}; వీథి = దారుల; అందున్ = లో; రాసకేళీ = రాసకేళి వలని {రాసకేళి - ఒకరి చేతులొకరు పట్టుకొని గుండ్రముగ పాటలకు లయబద్దముగ తిరుగు నాట్యవిశేషము}; మహా = గొప్ప; ఉల్లాసుఁడు = ఉల్లాసము కలవాడు; ఐ = అయ్యి; ఉత్ఫుల్ల = బాగుగ విరిసిన; జలజ = పద్మము {జలజ - నీటిలో పుట్టినది - పద్మము}; అక్షుఁన్ = కన్నులవాడు (కృష్ణుడు); ఒక = ఒక; నిశా = రాత్రి; సమయమునన్ = వేళ; తనరారు = అతిశయిస్తున్న; మంద్ర = మంద్ర స్థాయి {మంద్ర - నాభిస్థానమున పలుకుధ్వని, మధ్య - హృదయ స్థానమునపలుకుధ్వని, తారా - మూర్థమునందు పలుకుధ్వని}; మధ్యమ = మధ్యమ స్థాయి; తారములన్ = తారా స్థాయి లు; నింపు = నింపబడుట; తళుకొత్త = సరికొత్త, తళుకులు ఒత్తగ; రాగ = రాగములలోని; భేదములన్ = భేదములతో; చెలఁగి = చెలరేగి; ధైవత = ధైవతము (ద); ఋషభ = ఋషభము (రి); గాంధార = గాంధారము (గ); నిషాద = నిషాదము (ని); పంచమ = పంచమము (ప); షడ్జమ = షడ్జమము (స); మధ్యమ = మధ్యమము (మ); స్వరములు = (సప్త) స్వరములు; ఓలిఁన్ = వరుసలుగ; కళలు = కళలును {కళలు - కాల కాలపరిమాణ విశేషములు};
జాతులు = జాతులును {జాతులు - తాళ భేదములు}; మూర్చనల్ = మూర్చనలును {మూర్చనలు - స్వర సమూహముల భేదములు}; కలుగన్ = కలిగేలాగ; వేణు = వేణువు యొక్క; నాళ = గొట్టపు; వివరన్ = రంధ్రముల పై; అంగుళ = వేళ్ళ; న్యాస = ముద్రల వాడికలోని; లాలనమునన్ = సున్నితత్వముల; మహిత = గొప్ప; గతిన్ = విధానమున; పాడెన్ = పాడెను (పాటలు); అవ్యక్త = వివరించలేనంత; మధురముగను = తీయగా; పంకజ = పద్మము వంటి; అక్షుండు = కన్నులవాడు; దారువులు = మోళ్ళు; అంకురింపన్ = చిగురించునట్లు.

భావము:

అది ఒక శరత్కాలపు రాత్రి. పండువెన్నెలలో బృందావన మంతా తెల్లగా మెరిసిపోతోంది. విరబూచిన తామరలవంటి కన్నులు గల కృష్ణుడు ఆ వనంలో రాసకేళికి ఉపక్రమించాడు. ఆ క్రీడోల్లాసంతో పిల్లనగ్రోవి చేత బట్టాడు. దాని రంధ్రాలపై వ్రేళ్లూనుతు ఇంపుగా అనేక రాగాలను ఆలపించాడు. వాటిలో మంద్రస్థాయినీ, మధ్యమస్థాయినీ, తారస్థాయినీ వినిపించాడు. షడ్జమం, ఋషభం, గాంధారం, మధ్యమం, పంచమం, ధైవతం, నిషాదం అనే స్వరాలు, కళలు, జాతులు, ఆరోహణావరోహణ క్రమాలు తేటపడేటట్టుగా అవ్యక్త మధురంగా గానం చేసాడు. ఆ గానానికి మ్రోళ్లు చివురించాయి.