పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-183-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దివిజేంద్రప్రీతిగ వ
ల్లజను లేఁటేఁటఁ జేయు లాలిత సవనో
త్సము హరి మానిపిన గో
రులు గావింపకున్న లరిపుఁ డలుకన్.

టీకా:

దివిజ = దేవతలకు; ఇంద్ర = ఇంద్రునికి; ప్రీతిగన్ = ప్రీతి కలుగు నట్లు; వల్లవ = గోపాలక; జనులున్ = సమూహములు; ఏఁటేఁటఁన్ = ప్రతిఏటా; చేయు = చేస్తుండే; లాలిత = ఆనవాయితీ {లాలిత - లలి (క్రమము) ప్రకారము చేయునది, ఆనవాయితీ}; సవన = యజ్ఞ; ఉత్సవమున్ = ఉత్సవమును; హరి = కృష్ణుడు; మానిపినన్ = మానిపించగ; గోప = గోపకులలో; వరులున్ = శ్రేష్ఠులు; కావింపకున్న = చేయక పోవుటచే; బల = బలుడు అను రాక్షసుని; రిపుఁడు = శత్రువు (ఇంద్రుడు); అలుకన్ = కోపముతో.

భావము:

గోపకులు ప్రతిసంవత్సరము ఇంద్రుడికి ప్రితిగా చేసే యాగాన్ని శ్రీకృష్ణుడుమానిపించగా, గోపకులు యాగం చేయడం మానివేశారు. దానితో ఇంద్రుడు కోపంతో....