పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-176-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విటముగ నిజపదాహతిఁ
బ్రటముగా మూఁడు నెలల బాలకుఁడై యా
టనిశాటుని నంతక
నిటస్థునిఁ జేసె భక్తనికరావనుఁడై.

టీకా:

వికటముగన్ = వికృతముగ (ప్రకృతి విరుద్ధముగ); నిజ = తన; పద = కాలి; హతిన్ = దెబ్బతో; ప్రకటముగాన్ = గట్టిగ; మూఁడు = మూడు (3); నెలల = నెలల; బాలకుడు = పిల్లవాడు; ఐ = అయి ఉండగా; ఆ = ఆ; శకట = శకటుడు అను; నిశాటుని = రాక్షసుని; అంతకనికటస్థునిఁన్ = యమునిసమీపమునకు పోవునట్లుగ; చేసెన్ = చేసెను; భక్త = భక్తుల; నికర = సమూహమునకు; అవనుఁడు = కాపాడువాడువాడు; ఐ = అయి.

భావము:

భక్తలోక రక్షకుడైన శ్రీకృష్ణుడు మూడునెలల పిల్లవాడుగా ఉన్నాడు. శకటరూపంలో ఒక రాక్షసుడు అతణ్ణి పరిమార్చటానికి వచ్చాడు. అది గమనించిన బాలకృష్ణుడు తన కాలితన్నుతో ఆ దానవుణ్ణి దండధరుని వద్దకు సాగనంపాడు.