పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-173.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దుకులంబున లీలమై నుయ మయ్యె
వ్యయశుఁ డగు వసుదేవు భార్యలైన
రోహిణియు దేవకియు నను రూపవతుల
యందు నున్మత్తదైత్య సంహారి యగుచు.

టీకా:

తాపస = మునులలో; ఉత్తమ = ఉత్తముడా; విను = విను; దైత్య = రాక్షసుల; అంశములఁన్ = అంశలతో; పుట్టిన్ = పుట్టి; నర = మానవ; నాథులు = ప్రభువులు; అతుల = సాటిలేని; సేనా = సేనలతో; సమేతులు = కలిగినవారు; అగుచున్ = అగుచు; ధర్మ = ధర్మము; ఇతరులు = తప్పినవారు; ఐ = అయ్యి; ధాత్రిన్ = భూమిని; పెక్కు = ఎక్కువ; బాధలన్ = బాధలచే; అలంచుటఁన్ = కష్టపెట్టుతుండుట; చేసిన్ = వలన; ధరణి = భూమాత; వగలఁన్ = దుఃఖములను; పొందుచున్ = పొందుతూ; వాపోవన్ = మొరపెట్టగా; భూ = భూమి యొక్క; భారమున్ = భారమును, కష్టములను; ఉడుపుటన్ = కృశింప జేయుటకు, తగ్గించుటకు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి {హరి - దుఃఖములను హరించువాడు - భగవంతడు}; పరుఁడున్ = విష్ణుమూర్తి {పరుఁడు - సమస్తమునకు పరమై (బయట) నుండు వాడు}; నారాయణుండు = విష్ణుమూర్తి {నారాయణుండు - నారములందు ఉండువాడు}; చెచ్చెరఁన్ = శ్రీఘ్రముగ; తన = తన యొక్క; సిత = తెల్లని; అసిత = నల్లని; కేశ = రోమముల; యుగమునన్ = జంట వలన; బలరామ = బలరాముడు; కృష్ణ = కృష్ణుడు అను; రూపములఁన్ = రూపములతో; తనరి = ఒప్పి;
యదు = యాదవ; కులంబునన్ = వంశములో; లీలమైన్ = లీలార్థమై, విలాసముగ; ఉదయమయ్యెన్ = అవతరించెను; భవ్య = శుభ్రమైన; యశుఁడు = కీర్తి కలవాడు; అగు = అయిన; వసుదేవున్ = వసుదేవుని; భార్యలు = భార్యలు; ఐన = అయిన; రోహిణియున్ = రోహిణి; దేవకియున్ = దేవకి; అను = అనే; రూపవతులు = అందగత్తెలు {రూపవతులు - (మంచి) రూపము కల వారు, అందగత్తెలు}; అందున్ = అందు; ఉన్మత్త = మదించిన; దైత్య = రాక్షస; సంహారి = సంహరించు వాడు; అగుచున్ = అగుచు.

భావము:

మునిశ్రేష్ఠుడ! నారద! రాక్షస అంశలతో పుట్టిన రాజులు అనేకమంది తమ అపారసేనాబలాలతో అధర్మమార్గాన ప్రవర్తించారు. భూదేవికి పెక్కుబాధలు కలిగించారు. ఆమె దుఃఖిస్తూ విష్ణుమూర్తికి మొరపెట్టుకుంది. పరాత్పరుడైన శ్రీహరి మదోన్మత్తులైన దానవులను సంహరించి భూ భారాన్ని తొలగించాలనుకొన్నాడు. యదువంశంలో వన్నెకెక్కిన వాసుదేవునకు రోహిణి, దేవకి అనే భార్యల యందు తన తెల్లని వెంట్రుకతో బలరాముడాగానూ, నల్లని వెంట్రుకతో కృష్ణుడుగానూ ఆయన అవతరించాడు.