పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : కృష్ణావతారంబు

  •  
  •  
  •  

2-172-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి శ్రీరామావతారంబు జగత్పావనంబును నస్మత్ప్రసాద కారణంబును నై నుతికెక్కె; నింకఁ గృష్ణావతారంబు వివరించెద వినుము.

టీకా:

అట్టి = అటువంటి; శ్రీ = శుభకలమైన; రామ = రాముని; అవతారంబున్ = అవతారము; జగత్ = లోకములను; పావనంబునున్ = పవిత్రము చేయునది యును; అస్మత్ = మా; ప్రసాద = అనుగ్రహమునకు; కారణంబునున్ = కారణమును; ఐ = అయి; నుతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కెన్ = పొందినది; ఇంకన్ = ఇంక; కృష్ణ = కృష్ణుని; అవతారంబున్ = అవతారమును; వివరించెదన్ = వివరముగ చెప్పెదను; వినుము = వినుము.

భావము:

అటువంటి శ్రీరాముని అవతారం లోకపావనమై అస్మదాదులకు అనుగ్రహకారణ మయింది. ఇక కృష్ణావతారాన్ని వర్ణిస్తాను, విను.