పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-169-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

పుముల్ మూఁడును నొక్కబాణమున నిర్మూలంబు గావించు శం
రు చందంబున నేర్చె రాఘవుఁడు లంకాపట్టణం బిద్ధగో
పు శాలాంగణ హర్మ్య రాజభవనప్రోద్యత్ప్రతోళీ కవా
థాశ్వద్విప శస్త్ర మందిర నిశాశ్రేణితో వ్రేల్మిడిన్.

టీకా:

పురముల్ = పురములు; మూఁడునున్ = మూడింటిని; ఒక్క = ఒకే ఒక; బాణమునన్ = బాణముచేతనే; నిర్మూలంబున్ = ధ్వంసము; కావించు = చేయు; శంకరు = శివుని; చందంబునన్ = వలె; ఏర్చెన్ = నాశనము చేసెను, కాల్చెను; రాఘవుఁడు = రాముడు {రాఘవుడు, రఘువంశపు వాడు, రాముడు}; లంకా = లంకా; పట్టణంబు = పట్టణము; ఇద్ధ = ప్రసిద్ధమైన; గోపుర = గోపురములు; శాల = శాలలు; అంగణ = భవనములు; హర్మ్య = మేడలు; రాజభవన = రాజభవనములు; ప్రోద్యత్ = బాగుచేయబడిన, కళ్ళాపి చల్లిన; ప్రతోళి = పెద్దవీధులు; కవాట = తలుపులు; రథ = రథములు; అశ్వ = గుఱ్ఱములు; ద్విప = ఏనుగులు; శస్త్ర = ఆయుధముల; మందిర = శాలలు; నిశాట = రాక్షస; శ్రేణిన్ = సమూహములు; తో = తో సహా; వ్రేల్మిడిన్ = చిటికలో.

భావము:

పూర్వము శివుడు ఒకే బాణంతో త్రిపురాలను కాల్చివేసి నట్లు, రాముడు పెద్దపెద్ద గోపురాలు, శాలలు, ముంగిళ్లు, మేడలు , రాజగృహాలు, రచ్చలు, తలుపులు, రథాలు, గుఱ్ఱాలు, ఏనుగులు, ఆయుధాగారాలు, రాక్షసగణాలుతో నిండివున్న లంకానగరాన్ని చిటికలో భస్మీపటలం చేసాడు.