పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-168-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అయ్యవసరంబున సముద్రుండు కరుణాసముద్రుం డగు శ్రీరామభద్రుని శరణంబు సొచ్చినం గరుణించి యెప్పటి యట్ల నిలిపి నలునిచే సేతువు బంధింపించి తన్మార్గంబునం జని.

టీకా:

ఆ = ఆ; అవసరంబునన్ = సమయమున; సముద్రుండున్ = సముద్రుడు; కరుణా = కరుణకు; సముద్రుండున్ = సముద్రుడు; అగు = అయిన; శ్రీరామభద్రునిన్ = శ్రీరాముని; శరణంబున్ = శరణము; చొచ్చినన్ = వేడుకొనగా; కరుణించి = దయచూపి; ఎప్పటి = ఎప్పటి; అట్ల = వలెనే; నిలిపి = ఉంచి; నలుని = నలుడు అను కపి; చేన్ = చేత; సేతువున్ = వంతెనను; బంధింపించి = కట్టించి; తత్ = ఆ; మార్గమునన్ = దారి వెంట; చని = వెళ్ళి.

భావము:

అప్పుడు సముద్రుడు దయాసముద్రుడైన రామభద్రుడికి శరణాగతు డయ్యాడు. రాము డతనిపై దయచూపి యథాప్రకారం ఉండమని అనుగ్రహించాడు. నలుడనే వానర ప్రముఖునిచే వంతెన కట్టించి రాముడు సముద్రం దాటాడు.