పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-165-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిసుతుఁ బరిచరుఁగాఁ గొని
రిసుతుఁ దునుమాడి పనిచె రిపురమునకున్;
రివిభునకు హరిమధ్యను
రిరాజ్యపదంబు నిచ్చె రివిక్రముఁడై.

టీకా:

హరి = సూర్యుని (కోతి); సుతుఁన్ = పుత్రుని (సుగ్రీవుని); పరిచరుఁగా = సహచరునిగా; కొని = తీసుకొని; హరి = ఇంద్రుని, కోతి; సుతుఁన్ = పుత్రుని (వాలిని); తునుమాడి = చెండాడి; పనిచెన్ = పంపించెను; హరి = యముని; పురమున్ = పురము; కున్ = నకు; హరి = కోతుల; విభున్ = ప్రభువు (సుగ్రీవుడు); కున్ = కు; హరి = సింహము వంటి; మధ్యను = నడుము కలామెను (రుమను); హరి = కోతుల; రాజ్య = రాజు; పదంబున్ = పదవిని; ఇచ్చెన్ = ఇచ్చెను; హరి = సింహము వంటి; విక్రముఁడు = పరాక్రమశాలి; ఐ = అయి.

భావము:

సింహపరాక్రముడైన శ్రీరామచంద్రుడు సూర్యసుతుడైన సుగ్రీవుణ్ణి అనుచరునిగ స్వీకరించాడు. ఇంద్ర పుత్రుడైన వాలిని నేలగూల్చి యమపురికి పంపాడు. వానరాధిపుడైన సుగ్రీవునికి కిష్కింధ రాజ్యాన్ని, సింహం వంటి నడుము గల రుమని అప్పగించాడు.