పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-164-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కర కుల జలనిధి హిమ
రుఁ డగు రఘురామవిభుఁడు ఱకఱితోడన్
రుని వధించెను ఘనభీ
శరముల నఖిల జనులుఁ ర మరుదందన్.\

టీకా:

ఖరకర = సూర్య {ఖరకరుడు - ఎండను కలిగించు వాడు - సూర్యుడు}; కుల = వంశము అను; జలనిధి = సముద్రమునకు {జలనిధి - నీటికి నిధి - సముద్రము}; హిమ = చల్లదనమును; కరుఁడు = ఇచ్చు వాడు (చంద్రుడు) {హిమకరుఁడు - చల్లదనమును ఇచ్చువాడు - చంద్రుడు}; అగు = అయిన; రఘు = రఘు వంశపు; రామ = రాముడు అను; విభుఁడున్ = ప్రభువు; కఱకఱిన్ = కాఠిన్యము; తోడన్ = తోటి; ఖరుని = ఖరుడు (అను రాక్షసుని); వధించెను = సంహరించెను; ఘన = గొప్ప; భీకర = భయంకరమైన; శరములన్ = బాణములతో; అఖిల = సమస్త; జనులుఁన్ = జనములు; కర = మిక్కిలి; అరుదున్ = ఆశ్చర్యమును; అందన్ = పొందగా.

భావము:

సూర్యవంశమనే సముద్రానికి చంద్రునివంటివాడైన ఆ రామచంద్రుడు అందలి జనులందరు ఆశ్చర్యపడగా కోపంతో మిక్కిలి భయంకరమైన బాణాలు ప్రయోగించి ఖరుడనే రక్కసుణ్ణి ఉక్కడగించాడు.