పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-163-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నమున వసియించి నృ
పాననయశాలి యిచ్చె భయములు జగ
త్పాన మునిసంతతికిఁ గృ
పాననిధి యైన రామద్రుం డెలమిన్.

టీకా:

ఆ = ఆ; వనమున = అడవిలో; వసియించి = నివసించి; నృప = రాజుల లక్షణమైన; అవన = రక్షణ యందు; నయ = నేర్పుతో; శాలి = ఒప్పువాడు; ఇచ్చెన్ = ఇచ్చెను; అభయములున్ = అభయములు; జగత్ = లోకమలకు; పావన = పవిత్రము చేయునట్టి; ముని = మునుల; సంతతి = సమూహము; కిన్ = కి; కృపా = దయకు; వననిధి = సముద్రము {వననిధి - నీరు కి నిధి, సముద్రము}; ఐన = అయినట్టి; రామభద్రుండు = రామభద్రుడు {రామభద్రుడు - చక్కటి భద్రతను ఇచ్చువాడు, రాముడు}; ఎలమిన్ = సంతోషముతో, వికాసముతో.

భావము:

రాజుల లందరిలోను నీతిసంపన్నుడు, దయాసముద్రుడు అయిన ఆ శ్రీరాముడు ఆ దండకారణ్యంలోని లోకాలను పవిత్రం చేసే మునులు అందరికి అభయాలు యిచ్చాడు.