పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-162-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుదుగ లక్ష్మణుండు జనకాత్మజయుం దనతోడ నేఁగుదే
రిగి రఘూత్తముండు ముదమారఁగ జొచ్చెఁ దరక్షు సింహ సూ
కరి పుండరీక కపి డ్గ కురంగ వృకాహి భల్ల కా
ముఖ వన్యసత్త్వచయ చండతరాటవి దండకాటవిన్.

టీకా:

అరుదుగ = అపూర్వముగ; లక్ష్మణుండున్ = లక్ష్మణుడును; జనకాత్మజయున్ = సీతయును {జనకాత్మజ - జనకుని మానసపుత్రిక, సీత}; తన = తన; తోడన్ = కూడా; ఏఁగుదేన్ = రాగా; అరిగి = వెళ్ళి; రఘు = రఘు వంశమునకు; ఉత్తముండు = ఉత్తముడు (రాముడు); ముదము = సంతోష; ఆరఁగన్ = పూర్వకముగ; చొచ్చెన్ = ప్రవేశించెను; తరక్షు = సివంగులు; సింహ = సింహములు; సూకర = అడవి పందులు; కరి = ఏనుగులు; పుండరీక = పెద్దపులులు; కపి = కోతులు; ఖడ్గ = ఖడ్గ మృగములు; కురంగ = లేళ్ళు; వృక = తోడేళ్ళు; అహి = పాములు; భల్ల = ఎలుగుబంట్లు; కాసర = అడవిదున్నలు; ముఖ = మొదలైన; వన్య = అడవి; సత్త్వ = జంతు; చయ = సమూహములతో; చండతర = మిక్కిలి భయంకరమైన; అటవిన్ = అడవిని; దండకా = దండక అను; అటవిన్ = అరణ్యమును.

భావము:

లక్ష్మణుడు, సీత అడవులకు వెళ్తున్న రాముడి వెంట వెళ్ళారు. అలా రఘువంశ లలాముడైన ఆ శ్రీరాముడు సివంగులు, సింహాలు, అడవిపందులు, ఏనుగులు, పులులు, కోతులు, ఖడ్గమృగాలు, జింకలు, తోడేళ్లు, పాములు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు మొదలైన అడవి మృగాలు వసించే అత్యంత భీకరమైన దండకారణ్యం ప్రవేశించాడు.