పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-158.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళి సుధావర్త కుంతల హాస నాభి
లిత జనకావనీ పాల న్యకా ల
లామఁ బరిణయ మయ్యె లలాటనేత్ర
కార్ముకధ్వంస ముంకువ గాఁగ నతఁడు.

టీకా:

కిసయలయ = చిగురాకుల వంటి; ఖండేందున్ = చంద్రరేఖ వంటి; బిస = తామరతూడు వంటి; కుంద = మల్లెమొగ్గల వంటి; పద్మ = పద్మముల వంటి; అబ్జ = తమ్మిపూల వంటి; పదన్ = పాదములు; ఫాలన్ = నుదురు; భుజన్ = భుజములు; రదన్ = పలువరస; పాణిన్ = చేతులు; నేత్రన్ = నేత్రములును కలామెను; కాహళన్ = బాకాల వంటి; కరభ = ఏనుగు తొండము వంటి {కరభ - ముంజేయి, 1. మనికట్టునుండి చిటికెనవేలు మొదలుదాక గల చేతి వెలుపల భాగము వంటి, 2. కర (ఏనుగు) భ (చేయి, తొండము) వంటి}; చక్ర = చక్రవాకముల వంటి; వియత్ = ఆకాశము వంటి; పులిన = ఇసకతిన్నెలు; శంఖ = శంఖము వంటి; జంఘ = పిక్కలు; ఊరు = తొడలు; కుచ = స్తనములు; మధ్య = నడుము; జఘన = పిరుదులు; కంఠ = కంఠమును కలామెను; ముకుర = అద్దము వంటి; చందన = మంచిగంధము వంటి; బింబ = దొండపండు వంటి; శుక = చిలుక వంటి; గజ = ఏనుగు వంటి; శ్రీకార = శ్రీకారము వంటి; గండ = చెక్కిళ్ళు; గంధ = మేనిసువాసన; ఓష్ట = పెదవులు; వాక్ = మాటలు; గమన = నడకలు; కర్ణన్ = కర్ణములు కలామెను; చంపక = సంపెంగ; ఇందు = చంద్రుని వంటి; స్వర్ణ = బంగారము వంటి; శఫర = చేపల వంటి; ధనుస్ = విల్లు వంటి; నీల = ఇంద్రనీలముల వంటి; నాసిక = ముక్కు; అస్య = ముఖము; అంగన్ = శరీరము; దృక్ = చూపులు; భ్రూ = కనుబొమలు; శిరోజన్ = శిరోజములు కలామెను; అళి = తుమ్మెదల వంటి;
సుధ = వెన్నెల వంటి, అమృతము వంటి; ఆవర్త = సుడిగుండము వంటి; కుంతల = తలకట్టు; హాస = చిరునవ్వు; నాభిన్ = బొడ్డును; కలిత = కలిగిన; జనక = జనకుడు అను; అవనీ = భూమికి; పాల = పాలకుడు (జనకమహారాజు); కన్యకా = కుమార్తె అయిన; లలామఁన్ = స్త్రీని; పరిణయము = పెండ్లి; అయ్యెన్ = చేసుకొనెను; లలాటనేత్రన్ = శివునియొక్క {లలాటనేత్రుడు - నుదుట కన్ను కలవాడు}; కార్ముక = విల్లును; ధ్వంసము = విరచుట అను; ఉంకువ = కన్యాశుల్కము, ఓలి; కాఁగ = అగునట్లుగ; అతఁడు = అతడు (రాముడు).

భావము:

ఆ శ్రీరాముడు శివుని ధనుర్భంగం ఓలి కాగా జనకమహారాజు పుత్రిక సీతాదేవిని చేపట్టాడు. ఆ మహాదేవి పాదాలు చివుళ్ల వంటివి, ఫాలం అర్ధచంద్రుని వంచిది, భుజాలు తామరతూండ్ల వంటివి, దంతాలు మొల్లల వంటివి, హస్తాలు పద్మాల వంటివి, నేత్రాలు కలువల వంటివి, పిక్కలు కాహళుల వంటివి, తొడలు కరభాల వంటివి, స్తనాలు చక్రవాకాల వంటిని, నడుము ఆకాశం వంటిది, పిరుదులు ఇసుక తిన్నెల వంటివి, కంఠం శంఖం వంటిది, చెక్కిళ్లు అద్దాల వంటివి, శరీర పరిమళం చందనం వంటిది, పెదవి దొండపండు వంటిది, ముక్కు సంపెంగ వంటిది, మోము చంద్రుని వంటిది. శరీరం స్వర్ణం వంటిది, చూపులు చేపల వంటివి, కనుబొమలు ధనుస్సు వంటివి, తల వెండ్రుకలు నీలాల వంటివి ముంగురులు తుమ్మెదల వంటివి, నవ్వు అమృతం వంటిది, బొడ్డు సుడి వంటిది.