పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : రామావతారంబు

  •  
  •  
  •  

2-155.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

టుల దానవ గహన వైశ్వానరుండు
రావణాటోప శైల పురందరుండు
గుచు లోకోపకారార్థ వతరించె
రాముఁడై చక్రి లోకాభిరాముఁ డగుచు.

టీకా:

తోయజహిత = సూర్య {తోయజహిత - తోయము (నీళ్ళలో) జ (పుట్టినది) (పద్మము) హిత (ఇష్టుడు) - సూర్యుడు}; వంశ = వంశము అను; దుగ్ద = పాల; పారావర = సముద్రమునకు; రాకా = పూర్ణిమనాడు; విహార = విహరిస్తున్న; కైరవహితుండు = చంద్రుడు {కైరవహితుండు - కలువలకు ఇష్టుడు - కలువల రాయుడు -చంద్రుడు}; కమనీయ = అందమైన; కోసల = కోసల దేశపు {కోసల క్ష్మా భృత్సుత - కౌసల్య}; క్ష్మా = భూమికి; భృత్ = భర్త; సుతా = కుమార్తె (కౌసల్య); గర్భ = గర్భము అను; శుక్తి = ముత్యపు చిప్ప; సంపుట = లోపలి; లసత్ = ప్రకాశించు; మౌక్తికంబున్ = ముత్యమును; నిజ = తన; పాద = పాదముల; సేవక = సేవకుల; వ్రజ = సమూహము యొక్క; దుఃఖ = దుఃఖము అను; నిబిడ = చిక్కటి; అంధకార = చీకటికి; విస్పురిత = విచ్చుకొన్న; పంకరుహ = పద్మమునకు {పంకరుహ - బురదనందు పుట్టునది - పద్మము}; సఖుఁడు = ప్రియుడు (సూర్యుడు) {పంకరుహ సఖుడు - పద్మమునకు సఖుడు - సూర్యుడు}; దశరథ = దశరథు; ఈశ్వర = మహారాజు చే; కృత = చేయబడిన; అధ్వర = యఙ్ఞ; వాటికా = శాల; ప్రాంగణ = ప్రాంగణముకి, ముంగిలికి; ఆకర = వచ్చిఉన్న; దేవత = దేవతల; అనోకహంబు = వృక్షమును (కల్పవృక్షము) {దేవతానోకహంబు - దేవతా అనోకహంబు -};
చటుల = భయంకరమైన; దానవ = దానవులు అను; గహన = అడవికి; వైశ్వానరుడు = అగ్నిహోత్రుడును; రావణ = రావణుని; ఆటోప = సంరంభము అనెడి; శైల = పర్వతమునకు; పురంధరుండు = ఇంద్రుడు; అగుచున్ = అగుచు; లోక = లోకమలకు; ఉపకార = ఉపకారము; అర్థము = చేయుట కోసము; అవతరించెన్ = అవతరించెను; రాముఁడు = రాముడు; ఐ = అయ్యి; చక్రి = విష్ణువు {చక్రి - చక్రము ధరించువాడు - విష్ణువు}; లోక = లోకములకు; అభిరాముడు = మనోహరుడు; అగుచున్ = అగుచు.

భావము:

ఆయన సూర్యవంశమనే పాల్కడలికి పున్నమ చంద్రుడు. కోసలరాజు కూతురైన కౌసల్యాదేవి గర్భమనే ముత్తెపు చిప్పలో పుట్టిన మేలి ముత్యము. తన పాదసేవకుల శోకమనే చిమ్మచీకట్లను పోకార్చే సూర్యభగవానుడు. దశరథమహారాజు గారి పుత్రకామేష్ఠి యాగశాల ముంగిట మొలకెత్తిన కల్పవృక్షం. దానవులనే దారుణారణ్యాన్ని దహించే కార్చిచ్చు. రావణుని గర్వమనే పర్వతాన్ని బద్దలు చేసే ఇంద్రుడు. అయిన శ్రీరాముడుగా, చక్రధారి శ్రీ మహావిష్ణువు లోకోపకారం చేయుటకొరకు జగదభిరాముడై అవతరించాడు.