పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మత్స్యావతారంబు

  •  
  •  
  •  

2-153-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీ కంటకులైన హైహయనరేంద్రవ్రాతమున్ భూరివి
స్ఫురితోదారకుఠారధారఁ గలనన్ ముయ్యేడు మాఱుల్ పొరిం
బొరి మర్దించి, సమస్త భూతలము విప్రుల్ వేఁడఁగా నిచ్చి తాఁ
జి కీర్తిన్ జమదగ్నిరాముఁ డన మించెం దాపసేంద్రోత్తమా!

టీకా:

ధరణీ = భూమికి; కంటకులు = బాధించు వారు; ఐనన్ = అయిన; హైహయ = హైహయ వంశపు; నరేంద్ర = రాజుల; వ్రాతమున్ = సమూహమును; భూరి = మిక్కిలి; విస్పురిత = ప్రకాశిస్తున్న; ఉదార = అంచులు కల; కుఠార = గొడ్డలి; ధారన్ = పదునుతో; కలనన్ = రణరంగమున; ముయ్యేడు = మూడు ఏడులు, ఇరవై ఒక్క; మాఱుల్ = సార్లు; పొరింబొరిన్ = మరలమరల; మర్దించి = సంహరించి; సమస్త = సమస్తమైన; భూతలమున్ = భూమండలమును; విప్రుల్ = బ్రాహ్మణులు; వేఁడఁగాన్ = అడుగగా; ఇచ్చి = ఇచ్చి; తాన్ = తాను; చిర = చిరకాలము ఉండు, గొప్ప; కీర్తిన్ = కీర్తితో; జమదగ్నిరాముఁడు = జమదగ్నిరాముడు; అనన్ = అనగ; మించెన్ = అతిశయించెను; తాపస = తాపసులలో; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడ.

భావము:

మునీంద్రులలో అగ్రగణ్యుడవైన నారద! హైహయరాజులు లోక విరోధులై దురుసుగా ప్రవర్తించారు. వాళ్లను శిక్షించడానికి శ్రీమన్నారాయణమూర్తి జమదగ్నిసుతుడైన ఆ పరశురాముడుగా అవతరించాడు. రణరంగంలో ఇరవై యొక్కసార్లు ఈ రాజసమూహాన్ని దారుణమైన తన గండ్రగొడ్డలితో చెండాడు. బ్రాహ్మణులు వేడుకోగా భూమండల మంతా వాళ్లకు దానం చేసాడు. ఆ భార్గవరాముడు అలా శాశ్వత కీర్తితో వెలుగొందాడు.