పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మత్స్యావతారంబు

  •  
  •  
  •  

2-151-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లి నిజమౌళి నవ్వటుని పాదసరోరుహ భవ్యతీర్థ ము
త్కలిక ధరించి, తన్నును జత్త్రయమున్ హరికిచ్చి, కీర్తులన్
నిలిపె వసుంధరాస్థలిని నిర్జరలోక విభుత్వహానికిం
లఁకక శుక్రు మాటల కుఁదారక భూరివదాన్యశీలుఁడై.

టీకా:

బలి = బలి (చక్రవర్తి); నిజ = తన; మౌళిన్ = నెత్తిమీద; ఆ = ఆ; వటుని = బ్రహ్మచారి యొక్క; పాద = పాదము అను; సరోరుహ = పద్మమును; భవ్య = శుభకరమైన; తీర్థమున్ = తీర్థజలమును; ఉత్కలికన్ = అతిశయముతో {ఉత్కలిక - ఉత్ కలిక - అతిశయించు}; ధరించి = తాల్చి; తన్నునున్ = తనను; జగత్ = లోకములు; త్రయమున్ = మూటిని; హరి = విష్ణువు {హరి - దుఃఖములను హరించు వాడు}; కిన్ = కి; ఇచ్చి = ఇచ్చి; కీర్తులన్ = తన కీర్తితో; నిలిపెన్ = నింపెను; వసుంధరాస్థలిని = భూమండలమున; నిర్జర = దేవతల {నిర్జర - నిర్ జర - ముసలితనము లేని వారు, దేవతలు}; లోక = లోకమునను; విభుత్వ = అధికారము; హాని = నష్టమగుట; కిన్ = కి; తలఁకక = బెదరక; శుక్రు = శుక్రుని; మాటలున్ = మాటలు; కున్ = కు; తారక = కదియక, చేరక; భూరి = అతిమిక్కిలి; వదాన్య = దానమిచ్చు; శీలుఁడు = శీలము కలవాడు; ఐ = అయి.

భావము:

పరమదాత అయిన బలిచక్రవర్తి ఆ బ్రహ్మచారి వామనుని పాదపద్మాలు కడిగిన పవిత్ర తీర్థాన్ని ఉత్సుకతతో తలమీద చల్లుకున్నాడు. తనతోపాటు మూడులోకాలను నారాయణుడికి ధారాదత్తం చేసాడు. విశ్వమంతట శాశ్వతమైన యశస్సు నిలుపుకొన్నాడు. ఆ దానంవల్ల దేవలోకం మీద తనకున్న పెత్తనం పోతుందని జంక లేదు. తనకు హాని జరుగుతుందని శుక్రాచార్యుడు చెప్పినా లక్ష్య పెట్టలేదు.