పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మత్స్యావతారంబు

  •  
  •  
  •  

2-150-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్ఞేశ్వరుండగు రి విష్ణుఁ డదితి సం-
తానంబునకు నెల్లఁ మ్ముఁ డయ్యుఁ
బెంపారు గుణములఁ బెద్ద యై వామన-
మూర్తితో బలిచక్రర్తిఁ జేరి
ద్భూమి మూడు పామ్ము లనడిగి ప-
త్రయంబునను జత్త్రయంబు
వంచించి కొనియును వాసవునకు రాజ్య-
మందింప నీశ్వరుంయ్యు మొఱఁగి

2-150.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్థిరూపంబు గైకొని డుగ వలసె
ధార్మికుల సొమ్ము వినయోచిముగఁ గాని
వెడఁగుఁదనమున నూరక విగ్రహించి
లనమందింపరాదు నిశ్చయము పుత్ర!

టీకా:

యఙ్ఞేశ్వరుండు = యఙ్ఞమునకు అధికారి; అగు = అయిన; హరి = భగవంతుడు {హరి - దుఃఖమును హరించువాడు}; విష్ణుఁడు = విష్ణువు; అదితి = అదితి యొక్క {అదితిసంతానము - ఆదిత్యులు - దేవతలు}; సంతానంబున్ = సంతానము; కున్ = నకు; ఎల్లన్ = అందరకి; తమ్ముఁడు = తమ్ముడు; అయ్యుఁన్ = అయినప్పటికిని; పెంపారు = అతిశయిస్తున్న; గుణములఁన్ = గుణములతో; పెద్ద = పెద్దవాడు; ఐ = అయ్యి; వామన = వామన, పొట్టి; మూర్తి = స్వరూపము; తోన్ = తోటి; బలి = బలి; చక్రవర్తిఁన్ = చక్రవర్తిని; చేరి = దగ్గరకెళ్ళి; తత్ = అతని; భూమిన్ = భూమిని; మూడు = మూడు; పాదములన్ = అడుగులను; అడిగి = యాచించి; పద = అడుగులను; త్రయంబుననున్ = మూటితో; జగత్ = లోకములు; త్రయంబున్ = మూటిని; వంచించి = వంగదీసు, మోసగించి {వంచించు - వంచు (లొంగు) ఇంచు(తీయు)}; కొనియును = కొన్నప్పటికిని; వాసవున్ = ఇంద్రనకు; రాజ్యమున్ = రాజ్యమును; అందింపన్ = అందించుటకు; ఈశ్వరుండు = ప్రభువు; అయ్యున్ = అయినప్పటికిని; మొఱఁగి = మొరపెట్టుతూ, ఆర్తితో;
అర్థి = అర్థించువాని, యాచకుని; రూపంబున్ = రూపమును; కైకొని = చేపట్టి; అడుగన్ = అడుగ; వలసెన్ = వలసివచ్చెను; ధార్మికులన్ = ధర్మాత్ముల; సొమ్ము = ధనమును; వినయ = వినయమునకు; ఉచితముగఁన్ = తగినట్లు; కానిన్ = తప్ప; వెడఁగుఁన్ = వెకిలి; తనమునన్ = తనముతో; ఊరక = వ్యర్థముగ; విగ్రహించి = కలహించి, కోపించి; చలనమందింపన్ = కదిలింప, హరింప; రాదు = రాదు; నిశ్చయమున్ = నిశ్చయముగ; పుత్ర = కుమార.

భావము:

యజ్ఞాధిపుడైన విష్ణువు అదితి బిడ్డలలో కనిష్ఠుడు ఐనా ఉత్తమ గుణాలలో అందరికంటే జ్యేష్ఠుడు. అయన వామనాకారంతో బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి మూడడుగుల నేల అతణ్ణి యాచించి పుచ్చుకొన్నాడు. ఆ మూడడుగులతో ముల్లోకాలను ఆక్రమించి వంచనతో అపహరించాడు. తాను సర్వేశ్వరుడై వుండికూడ ఇంద్రుడికి రాజ్యం ముట్టజెప్పడానికై ఆయన వంచనతో బలిని యాచించవలసి వచ్చింది. సత్య ధర్మాత్ముల సొమ్ము వినయంగా వెళ్లి ఉచిత పద్ధతిలో గ్రహించాలి. అంతే కాని మూర్ఖత్వంతో పోట్లాడి ఆక్రమించ గూడదు సుమా. ఇది నిజం.