పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మత్స్యావతారంబు

  •  
  •  
  •  

2-146-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సులోకంబుఁ గలంచి దేవసమితిన్ స్రుక్కించి యుద్యద్గదా
రుఁడై వచ్చు నిశాచరుం గని, కనద్దంష్ట్రా కరాళస్య వి
స్ఫురిత భ్రూకుటితో నృసింహగతి రక్షోరాజ వక్షంబు భీ
భాస్వన్నఖరాజిఁ ద్రుంచె ద్రిజగత్కల్యాణసంధాయియై.

టీకా:

సుర = దేవ; లోకంబున్ = లోకమును; కలంచి = కలచి; దేవ = దేవతల; సమితిన్ = సమూహమును; స్రుక్కించి = బాధించి, ఓడించి; ఉద్యత్ = పైకెత్తిన; గదా = గదను; ధరుఁడు = ధరించినవాడు; ఐ = అయి; వచ్చు = వచ్చుచున్న; నిశాచరున్ = రాక్షసుని {నిశాచరుడు - నిశ (రాత్రి) చరించువాడు (తిరుగువాడు) - రాక్షసుడు}; కని = చూసి; కనత్ = తళుక్కుమనే; దంష్ట్రా = కోరలు; కరాళ = భయంకరమైన; ఆస్య = ముఖము; విస్ఫురిత = విచ్చుకున్న; భ్రూకుటి = భ్రుకుటి, కనుబొమలముడి; తోన్ = తోటి; నృసింహ = నరసింహ; గతిన్ = వలె, రూపముతో; రక్షస్ = రాక్షస; రాజ = రాజు యొక్క; వక్షంబున్ = వక్షమును; భీకర = భీకరమైన; భాస్వత్ = మెరుస్తున్న; నఖ = గోర్లు; రాజిఁన్ = సమూహమున; త్రుంచెన్ = చీల్చెను; త్రిజగత్ = ముల్లోకములకు; కల్యాణ = కల్యాణమును, శుభమును; సంధాయి = సమకూర్చువాడు; ఐ = అయి.

భావము:

ఒకప్పుడు రాక్షసుడు హిరణ్యకశిపుడు, దేవలోకంపై దండెత్తి దేవతలను బాధించసాగాడు. ప్రచండమైన గదాదండం చేబూని వస్తున్న ఆ దానవుణ్ణి శ్రీహరి చూచాడు. వాణ్ణి ఫరిమార్చి ముల్లోకాలకు క్షేమం కలిగించాలనుకొన్నాడు. వెంటనే కోరలతో భీతికొలిపే నోరు, కోపంతో ముడివడ్డ కనుబొమ్మలు కలిగిన నరసింహావతారం ధరించాడు. వాడి గోళ్లతో ఆ రాక్షసేశ్వరుని వక్షం చీల్చి హతమార్చాడు.