పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-136-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మానిత చరితుఁ డుత్తానపాదుం డను-
భూవరేణ్యునకు సత్పుత్రుఁ డనగ
నుదయించి మహిమఁ బెంపొంది బాల్యంబున-
నకుని కడనుండి వితితల్లి
ను నాడు వాక్యాస్త్రతిఁ గుంది మహిత త-
పంబు గావించి కాయంబుతోడఁ
ని మింట ధ్రువపదస్థాయి యై యటమీఁద-
ర్థి వర్తించు భృగ్వాది మునులుఁ

2-136.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

తురగతి గ్రింద వర్తించు ప్తఋషులుఁ
బెంపు దీపింపఁ దన్ను నుతింప వెలసి
ధ్రువుఁడు నా నొప్పి యవ్విష్ణుతుల్యుఁ డగుచు
నున్న పుణ్యాత్ముఁ డిప్పుడు నున్నవాఁడు.

టీకా:

మానిత = గౌరవిపబడిన; చరితుఁడు = ప్రవర్తన కలవాడు; ఉత్తానపాదుండు = ఉత్తానపాదుడు; అనున్ = అనే; భూవరేణ్యున్ = బ్రాహ్మణుని {భూవరేణ్యుడు - భూమిపైన శ్రేష్ఠుడు, రాజు}; కున్ = కి; సత్ = మంచి; పుత్రుఁడు = కుమారుడు; అనగ = అయ్యి; ఉదయించెన్ = పుట్టెను; మహిమఁన్ = గొప్పతనముతో; పెంపొందిన్ = వృద్ధిని; పొంది = పొంది; బాల్యంబునన్ = బాల్యములో; జనకుని = తండ్రి; కడ = వద్ద; నుండి = నుండి; సవతి = సవతి; తల్లి = తల్లి; తనున్ = తనను; ఆడు = పలుకు; వాక్ = మాటలు అను; అస్త్ర = అస్త్రముల; తతిన్ = సమూహమునకు; కుంది = బాధపడి; మహిత = గొప్ప; తపంబున్ = తపస్సును; కావించి = చేసి; కాయంబున్ = దేహము; తోడన్ = తోసహా; చని = వెళ్ళి; మింటన్ = ఆకాశములో; ధ్రువ = స్థిరమైన; పద = స్థానమున; స్థాయి = స్థిరుడు; ఐ = అయ్యి; అటమీదన్ = ఆపైన; అర్థిన్ = కోరికతో; వర్తించున్ = ప్రవర్తించు; భృగు = భృగువు; ఆది = మొదలగు; మునులుఁన్ = మునులు; చతుర = నేర్పరితనమైన;
గతిన్ = విధముగ; క్రిందన్ = క్రింద; వర్తించున్ = తిరుగుతుండే; సప్తఋషులున్ = సప్తఋషులు; పెంపున్ = గొప్పగ; దీపింపన్ = ప్రకాశించుతు; తన్నున్ = తనను; నుతింపన్ = కీర్తిస్తుండగ; వెలసి = ఏర్పడి; ధ్రువుఁడు = ధ్రువుడు; నాన్ = అనే పేరుతో; ఒప్పి = ప్రసిద్ధుడై; ఆ = ఆ; విష్ణున్ = విష్ణువునకు; తుల్యుఁడు = సమానుడు; అగుచున్ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; పుణ్యాత్ముఁడున్ = పుణ్యస్వరూపుడు; ఇప్పుడున్ = ఇప్పడుకూడ; ఉన్న వాడు = ఉన్నాడు.

భావము:

ఉత్తమచరిత్రుడైన ఉత్తానపాదు డనే రాజుకు సత్పుత్రుడుగా ధ్రువుడు జన్నించాడు, ప్రభావసంపన్నుడై పేరుగాంచాడు. చిన్న తనంలో ఒకనాడు తండ్రివద్ద ఉన్నప్పుడు సవతితల్లి సురుచి అతణ్ణి నిందావచనాలనే అస్ర్తాలతో నొప్పించింది. దుఃఖితుడైన ధ్రువుడు గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు ఫలించింది. భగవంతుడు సాక్షాత్కరించి అతణ్ణి అనుగ్రహించాడు. అతడు సశరీరంగా ఆకాశంలో మహోన్నతమైన ధ్రువస్థానంలో స్థిరపడ్డారు. ఆ స్థానానికి పైన వుండే భృగువు మొదలైన మహర్షులూ, క్రింద వుండే సప్తర్షులూ ఆ మహనీయుణ్ణి గొప్పగా ప్రశంసించారు. అతడు ధ్రువు డనే పేరుతో ప్రకాశించి విష్ణువుతో సమానుడైనాడు. ఇప్పుడు కూడా ఆ పుణ్యాత్ముడు ధ్రువస్థానం లోనే వున్నాడు.