పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నరనారాయణావతారంబు

  •  
  •  
  •  

2-125-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణుతింపఁగ నరనారా
ణు లన ధర్మునకు నుదయ మందిరి; దాక్షా
ణియైన మూర్తి వలనం
బ్రణుతగుణోత్తరులు పరమపావనమూర్తుల్.

టీకా:

గణుతింపఁగన్ = ఎంచి చూసిన; నర = నర; నారాయణులు = నారాయణులు; అనన్ = అనగ; ధర్మున్ = ధర్ముడున; కున్ = కు; ఉదయమందిరి = పుట్టిరి; దాక్షాయణి = దక్షుని కూతురు; ఐనన్ = అయిన; మూర్తి = మూర్తి అనే ఆమె; వలనన్ = వలన; ప్రణుత = స్తుతింపబడిన; గుణ = గుణములు కలవారిలో; ఉత్తరులు = ఉత్తములు; పరమ = అత్యుత్తమ; పావన = పవిత్రమైన; మూర్తులు = స్వరూపులు.

భావము:

మిక్కిలి ప్రసిద్ధమైన గుణాలు గలవారు, మిక్కిలి పవిత్రమూర్తులైన నరనారాయణు లనేవారు ధర్మానికి అధిష్ఠానమైన ధర్ముడికి, దక్షుని కుమార్తె అయిన మూర్తి యందు, జన్మించారు.