పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుని సంభాషణ

  •  
  •  
  •  

2-5-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నుల కెల్ల శుభము సాంఖ్య యోగము; దాని
లన ధర్మనిష్ఠలన నయిన
నంత్యకాలమందు రిచింత సేయుట
పుట్టువులకు ఫలము భూవరేంద్ర!

టీకా:

జనులకు = ప్రజలకు; ఎల్లన్ = అందరకు; శుభము = శుభమును ఇచ్చునది; సాంఖ్య = సాంఖ్యమను {సాంఖ్యము - ఒక ముఖ్యమైన హిందూ దర్శనము}; యోగము = యోగము; దాని = దాని; వలనన్ = వలన; ధర్మ = ధర్మము నాచరించుటలో; నిష్ఠ = శ్రద్ధ, దీక్ష; వలనన్ = వలన; అయినన్ = కలుగునట్టి; అంత్య = మరణాసన్న; కాలము = సమయము; అందున్ = లో; హరిన్ = హరిని; చింతన్ = ధ్యానము; చేయుటన్ = చేయగలుగుట; పుట్టువులు = జన్మములు; కున్ = కు; ఫలము = ప్రయోజనము; భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్రుడు - భూవర (రాజులలో) ఇంద్ర (శ్రేష్ఠుడు), మహారాజు};

భావము:

లోకులందరికి సాంఖ్యయోగం మేలు చేకూరుస్తుంది. ఏ యోగం వల్లనైనా లేక ధర్మాచరణతో నైనా సరే అవసానకాలంలో హరిని చింతించాలి. జన్మ మెత్తినందుకు ఓ నరవరా! ప్రయోజనం అలా హరిని చింతించటమే.