పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుని సంభాషణ

  •  
  •  
  •  

2-4-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున, సర్వాత్మకుఁడు, మ
హావిభవుఁడు, విష్ణుఁ, డీశుఁ డాకర్ణింపన్,
సేవింపను, వర్ణింపను,
భావింపను భావ్యుఁ డభవభాజికి నధిపా!

టీకా:

కావున = అందువలన; సర్వ = అందరియందు; ఆత్మకుడు = ఆత్మగా నుండువాడు; మహా = గొప్ప; విభవుడు = వైభవము ఉన్నవాడు; విష్ణుఁడు = విష్ణుమూర్తి; ఈశుఁడు = ఈశ్వరుడు; ఆకర్ణింపన్ = వినుటకు; సేవింపన్ = సేవచేయుటకు; వర్ణింపన్ = కీర్తించుటకు; భావింపను = స్మరించుటకు; భావ్యుఁడు = తగినవాడు; అభవ = పునర్జన్మము లేకపోవుటకు; భాజి = ప్రయత్నించు వాని; కిన్ = కి; అధిపా = అధికుడా - రాజా.

భావము:

కనుక, రాజేంద్రా! మోక్షమార్గంలో పయనించే వాడికి సర్వజీవరాశికి ఆత్మయైన వాడు, మహావైభవం కలవాడు, జగదీశ్వరుడు అయిన విష్ణువే స్మరించడానికి, సేవించడానికీ, కీర్తించడానికీ, తెలుసుకోడానికీ తగినవాడు.