పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : శుకుని సంభాషణ

  •  
  •  
  •  

2-3.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శు కళత్ర పుత్ర బాంధవ దేహాది
సంఘ మెల్లఁ దమకు త్య మనుచుఁ
గాఁపురములు సేసి డపటఁ జత్తురు,
నియుఁ గాన రంత్యకాలసరణి.

టీకా:

క్షితిపతి = రాజా {క్షితిపతి - రాజ్యమునకు ప్రభువు, రాజు}; నీ = నీ; ప్రశ్న = సందేహము; సిద్ధంబు = నిశ్చయముగ; మంచిది = శ్రేష్ఠమైనది; ఆత్మవేత్తలున్ = బుద్ధిమంతులు; మెత్తురు = మెచ్చుకొనెదరు; అఖిల = సమస్తమైన; శుభదము = శుభములను ఇచ్చునది; ఆకర్ణనీయంబులు = వినదగినవి; అయుత = వేలకొలది {అయుతము - పదివేలు}; సంఖ్యలున్ = గణించదగినవి; కలవు = ఉన్నవి; అందున్ = అందులో; ముఖ్యంబు = ముఖ్యమైనది; ఇది = ఇది; అఖిల = అన్నివిధములను; వరము = కోరదగినది; గృహములు = నివాసములు; లోపలన్ = లోపల; గృహమేధులు = గృహస్థులు; అగు = అగు; నరులు = మానవులు; ఆత్మ = ఆత్మయొక్క; తత్త్వమున్ = స్వభావమును; లేశము = కొంచెము; ఐన = అయినను; ఎఱుంగరు = ఎరుగరు; అంగనా = స్త్రీలతోటి; రతులన్ = సౌఖ్యములందు; నిద్ర = నిద్రించుటందు; ఆసక్తిన్ = ఆసక్తిలోను; చనున్ = జరిగిపోవును; రాత్రి = రాత్రి; పోవున్ = జరిగిపోవును; కుటుంబ = కుటుంబము - ఆలుబిడ్డలు; అర్థన్ = కొరకైన; బుద్ధిన్ = ఆలోచనలతో; అహము = పగలు;
పశు = పశు సంపద; కళత్ర = భార్య; పుత్ర = సంతానము; బాంధవ = బంధువులు; దేహ = శరీరము; ఆది = మొదలగు వాని; సంఘము = సమూహము; ఎల్లన్ = అంతా; తమకున్ = తమకు; సత్యము = నిజము; అనుచున్ = అనుకొనుచు; కాపురములు = కాపురములు; సేసిన్ = చేయుచు; కడపటన్ = చివరకు; చత్తురు = చనిపోవుదురు; కనియున్ = కనిపిస్తున్నప్పటికిని; కానరు = చూడరు; అంత్య = తుదకు; కాల = కాలము గమనము యొక్క; సరణి = స్వభావమును.

భావము:

“ఓ పరీక్షిత్తు మహారాజా! ఇప్పుడు నీవడిగిన ప్రశ్న చాలా సమంజసమైనది. దీనిని ఆత్మతత్త్వం తెలిసిన వాళ్లు మెచ్చుకుంటారు. ఇది సమస్త శుభాలను సమకూరుస్తుంది. లోకంలో వినదగిన విషయాలు వేలకొలది ఉన్నాయి. అందులో ఇతి అతి ముఖ్యమైంది. గొప్పది యిది. సంసారంలో మునిగితేలుతున్న గృహస్థులకు ఆత్మతత్త్వం కొంచెము కూడా తెలియదు. వాళ్లకు స్ర్తీ సంగమం, నిద్రలతో రేయి అంతా గడచిపోతుంది. పగలంతా కుటుంబ వ్యవహారాలతో సరిపోతుంది. పశువులూ, భార్యాబిడ్డలూ, చుట్టాలూ, శరీరమూ ఇత్యాది పరివార మంతటినీ నిజమని నమ్ముకొని సాగిస్తూ, కడకు వాళ్లు కన్నుమూసి కాటిపాలవుతారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారు.