పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : పరమాత్ముని లీలలు

  •  
  •  
  •  

2-109-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కొని యమ్మహాత్మకుఁడు దాల్చిన యయ్యవతారకర్మముల్
వెయఁగ నస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు; మ
య్యఘు ననంతునిం జిదచిదాత్మకు నాద్యు ననీశు నీశ్వరుం
దెలియఁగ నేర్తుమే తవిలి; దివ్యచరిత్రున కేను మ్రొక్కెదన్.

టీకా:

తలకొని = పూనుకొని; ఆ = ఆ; మహాత్మకుడు = భగవంతుడు {మహాత్మకుడు - గొప్ప ఆత్మ కలవాడు}; తాల్చిన = ధరించిన; ఆ = ఆ; అవతార = అవతారములు; కర్మమముల్ = చేసిన పనులు; వెలయఁగన్ = ప్రకాశముగ; అస్మత్ = నేను; ఆదులము = నాబోటి వారము; వేయి = అనేక; విధంబులన్ = విధములుగ; సన్నుతింతుము = స్తుతింతుము; ఆ = ఆ; అలఘున్ = భగవంతుని {అలఘున్ - తక్కువన్నది లేని వాడు}; అనంతునిన్ = భగవంతుని {అనంతుడు – అంతము లేని వాడు}; చిదచిదాత్మకునిన్ = భగవంతుని {చిదచిదాత్మకుడు - చిత్ ఆచిత్ ఆత్మకుడు, చేతనా అచేతనములు తానే అయిన వాడు}; ఆద్యున్ = భగవంతుని {ఆద్యుడు - సమస్తమునకు మూలము అయిన వాడు}; అనీశున్ = భగవంతుని {అనీశుడు - తనకు ఏ ప్రభువు లేని వాడు, విష్ణుసహస్రనామాలు శ్రీశంకరభాష్యం 626వ నామం}; ఈశ్వరున్ = భగవంతుని {ఈశ్వరుండు - అధిపతి}; తెలియఁగన్ = తెలిసికొనుట; నేర్తుమే = చేయగలమా ఏమి; తవిలి = లగ్నుడనై; దివ్య = దివ్యమైన; చరిత్రన్ = చరిత్ర కలవాని; కిన్ = కి; ఏను = నేను; మ్రొక్కెదన్ = నమస్కరించెదను.

భావము:

జగద్రక్షణకు పూనుకొని ఆ యా అవతారాలలో ఆ మహాత్ముడు చేసిన పనులను, నాలాంటి వాళ్ళం అందరం వేల రకాలుగా వినుతిస్తూ వుంటాం. మహామహుడు, తుది లేనివాడు, చిదచిత్స్వరూపడు, మొదటివాడు, తనకు ప్రభువు లేనివాడు, తానే ప్రభువైనవాడు అయిన ఆ దేవదేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవునకు నేను నమస్కరిస్తాను.