పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-97-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నువులు, దేవదానవులు, మానవనాథులు, మర్త్యకోటి, దా
యము వారివారికిఁ బ్రియంబగు దేవతలన్ భజించుచున్
తర నిష్ఠ యజ్ఞములఁ గైకొని చేసిరి; తత్ఫలంబుల
య్యనుపమమూర్తి యజ్ఞమయుఁడైన రమావరునందుఁ జెందఁగన్.

టీకా:

మనువులు = మునువులు {మనువులు - వైవస్వాదులు 14 మంది - స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుసుడు, వైవస్వతుడు, సూర్యసావర్ణి, దక్షసావర్ణి, బ్రహ్మసావర్ణి, ధర్మసావర్ణి, రుద్రసావర్ణి, రౌచ్యుడు, భౌచ్యుడు}; దేవ = దేవతలు; దానవులు = దానవులు; మానవ = మానవులకు; నాధులు = ప్రభువులు; మర్త్యకోటిన్ = మానవ సమూహములు; తారున్ = వారంతా; అనయమున్ = అవశ్యముగ; వారి = వారి; వారికిన్ = వారికి; ప్రియంబున్ = ప్రియము; అగు = అయిన; దేవతలన్ = దేవతలను; భజించుచున్ = పూజించుచు; ఘనతర = మిక్కిలి గట్టి; నిష్ఠన్ = నిష్ఠతో; యజ్ఞములన్ = యజ్ఞములను; కైకొని = చేపట్టి; చేసిరి = చేసిరి; తత్ = దాని; ఫలంబున్ = ఫలితమును; ఆ = ఆ; అనుపమ = సాటిలేని; మూర్తి = స్వరూపుడు; యజ్ఞ = యజ్ఞము; మయుఁడున్ = తానే అయినవాడు; ఐన = అయినట్టి; రమావరున్ = భగవంతుని {రమావరుడు - రమ+వరుడు - లక్మీదేవిభర్త, విష్ణువు}; అందున్ = కి; చెందఁగన్ = చెందునట్లు.

భావము:

అది చూసి స్వాయంభువుడు మొదలైన మనువులూ, దేవతలూ, దానవులూ, రాజులూ, మనుష్యులూ మున్నగు వారు అందరూ, వాళ్ల వాళ్ల కిష్టమైన దేవతలను కొలుస్తూ సాటిలేనివాడూ, యజ్ఞస్వరూపుడూ అయిన లక్ష్మీనాథునికి ఫలం చెందేలాగ మహానిష్ఠతో యజ్ఞాలు చేశారు.