పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-96-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్పుడు బ్రహ్మలు దమలోఁ
ప్పక ననుఁ జూచి సముచిక్రియు లగుచు
న్నప్పరమేశున కభిమత
మొప్పఁగఁదగు సప్తతంతు వొగిఁ గావింపన్.

టీకా:

అప్పుడు = అప్పటి నుండి; బ్రహ్మలు = బ్రాహ్మణులు; తమలోన్ = తమలో; తప్పక = తప్పకుండగ; ననున్ = నన్ను; చూచి = చూచుకొని; సముచిత = తగు; క్రియులు = కర్మలుచేయువారు; అగుచున్ = అగుచూ; ఆ = ఆ; పరమేశున్ = భగవంతుని {పరమేశ్వరుడు - అత్యున్నత ప్రభువు}; కున్ = కి; అభిమతమున్ = కోరిక; ఒప్పగన్ = తీర్చుటకు; తగు = తగిన; సప్తతంతువు = యజ్ఞము; ఒగిన్ = చక్కగ; కావింపన్ = నిర్వహించగ, చేయగా.

భావము:

అప్పుడు మరీచి మొదలైన ప్రజాపతులు నేను చేసిన యాగం చూసి తాము గూడా ఉత్సుకులై ఆ భగవానునికి ప్రీతి కలగేటట్లు యజ్ఞం చేశారు.