పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-94.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్పణంబులు బోధాయనాది కర్మ
రణి మొదలగు యజ్ఞోపరణసమితి
యంతయును నమ్మహాత్ముని వయవములు
గాఁగఁ గల్పించి విధివత్ప్రకారమునను.

టీకా:

పశున్ = యజ్ఞపశువులు; యజ్ఞవాటన్ = యజ్ఞవాటికలు, యజ్ఞశాలలు; యూపస్తంభ = యజ్ఞపశువును కట్టుస్తంభములు; పాత్రన్ = పాత్రలు; మృద్ఘటన్ = మట్టికుండలు; శరావన్ = మూకుడులు; వసంత = వసంత; కాలములున్ = కాలములును; స్నేహ = నెయ్యి; ఓషధీ = ధాన్యాదులు; బహు = అనేకవిధమైన; లోహన్ = లోహములు; చాతుర్హోత్ర = నాలుగు హోతల తంత్రములు {చాతుర్హోత్రలు - బ్రహ్మ, హోత, అధ్వర్యుడు, అగ్నీధ్రుడు}; మతన్ = పద్ధతులు; నామధేయ = పేర్లు; సన్మంత్రములున్ = సరియగు మంత్రములు; సంకల్ప = సంకల్పాదులు; ఋక్ = ఋగ్వేద; యజుస్ = యజుర్వేద; సామన్ = సామవేదములల్; నియుక్త = నియమింపబడిన; వషట్కారన్ = వషట్కారములు {వషట్కారములు - వషట్ అను శబ్దములుండు మంత్రములు}; మంత్ర = మంత్రముల; అనుచరణములునున్ = ప్రయోగ విధములు; దక్షిణలున్ = యజ్ఞసమయపు దక్షిణలు; దేవత = దేవతలను; ధ్యానన్ = ధ్యానించుటలు; తత్ = వాటికి; అనుగత = అనుసరించి; తంత్ర = తంత్రములు; వ్రతన్ = వ్రతములకు; ఉద్దేశ = ఉద్దేశించిన; ధరణీసురులున్ = బ్రాహ్మణులును {ధరణీసురులు - భూమికి దేవతలు - బ్రాహ్మణులు}; అర్పణంబులున్ = నైవేద్యాదులు;
బోధాయన = బోధాయనము; ఆది = మొదలగు (గ్రంధములు, మార్గములు); కర్మ = కర్మముల; సరణి = విధానములు; మొదలగు = మొదలైన; యజ్ఞ = యజ్ఞమునకు; ఉపకరణ = ఉపయోగించు వస్తువుల; సమితిన్ = సమూహములు; అంతయున్ = అంతా; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని; అవయవములు = అవయవములు; కాఁగన్ = అయినట్లు; కల్పించి = కల్పించుకొని; విధివత్ = పద్దతి; ప్రకారముననున్ = ప్రకారముగను.

భావము:

యజ్ఞపశువులు, యాగశాల, యూపస్తంభము, పాత్రలు, మట్టికుండలు, మూకుళ్లు, యాగానికిక తగిన వసంత ఋతువు, నేయి, వడ్లూ మొదలైన ఓషధులు, కాంచనాదులైన వివిధలోహాలు, నలుగురు హోతలతో గూడిన దర్శపూర్ణిమాసాది కర్మలూ, జ్యోతిష్టోమాది నామాలూ, మంత్రాలూ, సంకల్పమూ, ఋగ్యజుస్సామ వేదాలలోని వషట్కారాలతో గూడిన మంత్రాలూ, యాగదక్షిణలూ, దేవతాధ్యానమూ, దానికి తగిన తంత్రాలూ, వ్రతాలూ, భూసురులూ, దేవతల నుద్దేశించి చేసే కర్మ సమర్పణమూ, బోధాయనాది కల్పగ్రంథాలలోని కర్మక్రమమూ, యజ్ఞానికి కావలసిన ఇతర సంభారాలూ; ఇవన్నీ ఆ పరమేశ్వరుని అవయవాలుగా కల్పించాను. ఆపై శాస్ర్తోక్త విధి ననుసరించాను.