పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-93-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ట్టి యనంతశక్తి జగదాత్ముని నాభిసరోజమందుఁ నేఁ
బుట్టి యజింపఁగా మనసు పుట్టిన యజ్ఞపదార్థజాతముల్
నెట్టన కానరామికి వినిర్మల మైన తదీయ రూపమున్
ట్టిగ బుద్ధిలో నిలిపి కంటి నుపాయము నా మనంబునన్.

టీకా:

అట్టి = అటువంటి; అనంత = అంతులేని; శక్తి = శక్తిమంతుని; జగదాత్మునిన్ = భగవంతుని {జగదాత్ముడు- జగత్తు తన స్వరూపమైన వాడు}; నాభి = బొడ్డు; సరోజము = పద్మము {సరోజము - సరస్సున పుట్టునది - పద్మము}; అందున్ = లో; నేన్ = నేను; పుట్టి = జన్మించి; యజింపఁగాన్ = యజ్ఞముచేయ వలనని; మనసు = ఇష్టము; పుట్టిన = ఏర్పడగ; యజ్ఞ = యజ్ఞముచేయుటకు; పదార్థ = వలసిన వస్తువుల; జాతముల్ = సమూహములు; నెట్టన = కొంచమైనను, తప్పక (ఆంధ్ర శబ్ధరత్నాకరము); కానన్ = కనిపించుట; రామిన్ = పోవుటచేత; వినిర్మలము = విశిష్టముగ నిర్మలము; ఐనన్ = అయినట్టి; తదీయ = అతని; రూపమున్ = స్వరూపమున్; గట్టిగన్ = స్థిరముగ; బుద్ధిన్ = మనసు; లోన్ = లోపల; నిలిపి = నిలుపుకొని; కంటిన్ = కనుగొంటిని; ఉపాయమున్ = ఉపాయమును; నా = నా యొక్క; మనంబునన్ = మనసులో.

భావము:

అటువంటి అనంతశక్తి గల విశ్వాత్ముని బొడ్డు తామరలో నేను పుట్టాను. నాకు యజ్ఞం చేయాలనే బుద్ధి పుట్టింది. కాని యజ్ఞాని కవసరమైన పదార్థా లేవీ నాకంటికి కనిపించలేదు. అపుడు అతి స్వచ్ఛమైన ఆ భగవంతుని స్వరూపాన్ని దృఢంగా బుద్ధిలో నిలిపి ధ్యానం చేశాను. అపుడు నా మనస్సులో ఒక ఉపాయం తోచింది.