పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-105-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళినాక్షు నందనుఁడ య్యుఁ, బ్రజాపతి నయ్యు, యోగ వి
ద్యా నిపుణుండ నయ్యునుఁ, బదంపడి మజ్జననప్రకారమే
యేను నెఱుంగ, నవ్విభుని యిద్ధమహత్త్వ మెఱుంగ నేర్తునే?
కానఁబడున్ రమేశపరిల్పితవిశ్వము గొంతకొంతయున్.

టీకా:

ఆ = ఆ; నళినాక్షున్ = విష్ణుమూర్తికి {నళినాక్షుడు - పద్మముల వంటి కళ్ళు ఉన్నవాడు}; నందనుండన్ = పుత్రుడను; అయ్యున్ = అయినప్పటికిని; ప్రజాపతిన్ = ప్రజాపతిని {ప్రజాపతి - ప్రజల సృష్టికి అధికారి}; అయ్యున్ = అయినప్పటికిని; యోగ = యోగ; విద్యా = విద్య యందు; నిపుణుండన్ = నేర్పరిని; అయ్యున్ = అయినప్పటికిని; పదంపడి = మరి; మత్ = నా యొక్క; జనన = పుట్టుక; ప్రకారమే = విధానమే; ఏను = నేను; ఎఱుంగన్ = తెలిసుకొనలేను; ఆ = ఆ; విభుని = ప్రభువు యొక్క; ఇద్ధ = పరిశుద్ధమైన; మహత్వము = గొప్పతనము; ఎఱుంగన్ = తెలిసుకొనుట; నేర్తునే = చేయగలనా; కానన్ = కనిపిస్తుంటుంది; రమేశ = భగవంతునిచే {రమేశుడు - రమ యొక్క భర్త - విష్ణువు}; పరికల్పిత = సృష్టింపబడిన; విశ్వము = జగత్తు; కొంత = కొంచెము; కొంతయున్ = కొంచెముగను.

భావము:

నేను ఆ పద్మలోచనుని కుమారుడనే, ప్రజాపతినే, యోగవిద్యలో నేర్పరినే అయినను, నా పుట్టుక ఎలా జరిగిందో నేనే తెలుసుకోలేకున్నాను. ఇక ఆ ప్రభుని ప్రదీప్త ప్రభావం ఎలా తెలుసుకోగలను ఆ లక్ష్మీనాథుడు కల్పించిన ఈ ప్రపంచం కొంచెం కొంచెం నాకు గోచరిస్తున్నది.