పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-104-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ది యంతయును నిక్క మే బొంక నుత్కంఠ-
తిఁ దద్గుణధ్యానహిమఁ జేసి
రికింప నే నేమి లికిన నది యెల్ల-
త్యంబ యగు బుధస్తుత్య! వినుము;
ధీయుక్త! మామకేంద్రియములు మఱచియుఁ-
బొరయ వసత్యవిస్ఫురణ మెందు;
దిగాక మత్తను వామ్నాయ తుల్యంబు
మరేంద్ర వందనీయంబు నయ్యెఁ;

2-104.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విలి యా దేవదేవుని వమహాబ్ధి
తారణంబును మంగళకారణంబు
ఖిల సంపత్కరంబునై లరు పాద
నజమున కే నొనర్చెద వందనములు.

టీకా:

ఇది = ఇది; అంతయున్ = అంతాకూడ; నిక్కము = నిజమైనది; ఏన్ = నేను; బొంకన్ = అబద్దమాడుటలేదు; ఉత్కంఠ = కుతూహలమైన; మతిన్ = మనసుతో; తత్ = అతని; గుణన్ = గుణములు; ధ్యాన = ధ్యానము యొక్క; మహిమన్ = మహిమ; చేసి = వలన; పరికింపన్ = చూడగా; నేన్ = నేను; ఏమి = ఏమి; పలికినన్ = పలికితే; అదిన్ = అది; ఎల్ల = అంతయును; సత్యంబ = నిజమే; అగున్ = అగును; బుధ = బుద్ధిమంతులచే; స్తుత్య = కీర్తింపబడువాడా; వినుము = వినుము; ధీ = బుద్ధిశక్తి; యుక్త = కలిగినవాడా; మామక = నా యొక్క; ఇంద్రియములు = ఇంద్రియములు; మఱచియున్ = మరచిపోయికూడ; పొరయువున్ = పొందవు; అసత్య = అబద్దము; విస్ఫురణమున్ = స్ఫురించుటమాత్రమైన; ఎందున్ = ఎక్కడైన; అదిన్ = అదే; కాక = కాకుండగ; మత్ = నా యొక్క; తనువున్ = శరీరము; ఆమ్నాయ = వేదములకు; తుల్యంబున్ = సమానమైనది; అమరేంద్ర = దేవేంద్రునిచే; వందనీయంబున్ = నమస్కరించదగ్గది; అయ్యెన్ = అయినది; తవిలి = పట్టుదలగ;
ఆ = ఆ; దేవ = దేవతలకే; దేవుని = దేవుడైనవానికి; భవ = సంసారమను; మహాబ్ధి = మహాసముద్రము; తారణంబునున్ = తరింపజేయునది; మంగళ = శుభములకు; కారణంబున్ = కారణమును; అఖిల = సమస్త; సంపత్కరంబున్ = సంపదలను ఇచ్చునది; ఐ = అయ్యి; అలరు = శోభిల్లు; పాద = పాదములు అను; వనజమున్ = పద్మమున; కున్ = కు; ఏన్ = నేను; ఒనర్చెదన్ = చేసెదను; వందనములు = నమస్కారములు.

భావము:

ఇప్పుడు నేను చెప్పినదంతా నిజం. నేను అసత్యమాడను. పండిత స్తుతి పాత్రుడవైన ఓ నారదా! విను. కోరి ఆ భగవంతుని గుణాలను ధ్యానించడం వల్ల కలిగిన ప్రభావంతో, నే నేమి పలికినా అదంతా నిజమే అవుతుంది. ఓ బుద్ధిమంతుడా! నా ఇంద్రియాలు ఏ సందర్భంలో గానీ పొరపాటునగూడ అసత్యం వైపు ప్రసరించవు. అంతే కాదు. నా శరీరం వేదంతో సమానం. దేవేంద్రునికి గూడ ఇది నమస్కరింపదగిన దయింది. సంసార సాగరాన్ని దాటించేది, శుభాలకు హేతువై నది, సమస్తసంపదలను సమకూర్చేది అయిన ఆ దేవాదిదేవుని పాదపద్మ యుగళానికి నేను భక్తి భావంతో ప్రణామాలు చేస్తున్నాను.