పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-103-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రి భగవంతుఁ డనంతుఁడు
రుణాంబుధి సృష్టికార్యకారణహేతు
స్ఫుణుం డవ్విభుకంటెం
రుఁ డెవ్వఁడు లేడు తండ్రి! రికింపంగన్.

టీకా:

హరి = భగవంతుడు {హరి - పాపములను హరించువాడు}; భగవంతుఁడు = భగవంతుడు; అనంతుఁడు = భగవంతుడు {అనంతుడు – అంతము లేనివాడు}; కరుణాంబుధి = దయాసముద్రుడు; సృష్టి = సృష్టించు; కార్య = పనికి; కారణ = కారణమునకు; హేతు = కారణభూతుడై; స్పురణుండు = మెలగువాడు; ఆ = ఆ; విభు = ప్రభువు; కంటెన్ = కంటెను; పరుడు = ఇతరుడు; ఎవ్వఁడున్ = ఎవడును; లేడున్ = లేడు; తండ్రీ = నాయనా; పరికింపన్ = పరిశీలనగ చూసినచో.

భావము:

ఫుత్రా! శ్రీహరి భగవానుడు, అంతము లేనివాడు, దయాసముద్రుడు, సృష్టి అనే కార్యానికి కారణభూత మైనవాడు. ఆలోచించి చూచినచో ఆ ప్రభుని కంటే శ్రేష్ఠుడైనవాడు ఇంకొక డెవ్వడూ లేడు.