పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-102-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విను వత్స! నీవు నన్నడి
గి ప్రశ్నకు నుత్తరంబు కేవలపరమం
బును బ్రహ్మంబీ యఖిలం
బు కగు నాధార హేతుభూతము సుమ్మీ.

టీకా:

విను = వినుము; వత్స = కుమారా; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడిగిన = అడిగినట్టి; ప్రశ్న = ప్రశ్న; కున్ = కు; ఉత్తరంబున్ = ఉత్తరము; కేవల = కేవలము; పరమంబునున్ = అత్యుత్తమును; బ్రహ్మంబు = బ్రహ్మము; ఈ = ఈ; అఖిలంబున = సమస్తమున; కున్ = కు; అగున్ = అగును; ఆధార = ఆధారమునకు; హేతు = కారణ; భూతము = అయినట్టిది; సుమ్మీ = సుమీ.

భావము:

నీవు నన్ను అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాను, విను. కుమారా! ఈ సమస్త విశ్వానికి ఆధారభూత మైనది పరబ్రహ్మము ఒకటే సుమా.