పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : నారయ కృతి ఆరంభంబు

  •  
  •  
  •  

2-101-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని నియుక్తిఁ జెంది సచరాచర భూతసమేతసృష్టి నే
వితముగా సృజింతుఁ బ్రభవిష్ణుఁడు విష్ణుఁడు ప్రోచుఁ బార్వతీ
తి లయమొందఁ జేయు; హరి పంకరుహోదరుఁ డాదిమూర్తి య
చ్యుతుఁడు త్రిశక్తియుక్తుఁ డగుచుండును నింతకుఁ దానమూలమై.

టీకా:

అతని = అతని యొక్క; నియుక్తినిన్ = నియమమును; చెంది = అనుసరించి; సచర = కదులునవి (జంతు, పక్షి జాతులు); అచర = కదల లేనివి (చెట్లు, చేమలు); భూత = జీవరాశులతో; సమేత = కూడిన; సృష్టిన్ = సృష్టిని; ఏన్ = నేను; వితతముగన్ = వికసించునట్లు; సృజింతున్ = సృష్టింతును; ప్రభవిష్ణుఁడు = అవతారములెత్తువాడు; విష్ణుఁడు = విష్ణుమూర్తి; ప్రోచున్ = రక్షించును; పార్వతీపతిన్ = శివుడు {పార్వతీపతి - పార్వతికి భర్త - శివుడు}; లయమున్ = అంతము; ఒందన్ = పొందునట్లు; చేయున్ = చేయును; హరి = భగవంతుడు; పంకరుహోదరుఁడు = భగవంతుడు {పంకరుహోదరుడు - పంకరుహ(పద్మము) ఉదరుడు - విష్ణువు}; ఆదిమూర్తి = భగవంతుడు {ఆదిమూర్తి - సృష్టికి ఆదిన ఉన్నవాడు}; అచ్యుతుఁడు = భగవంతుడు {అచ్యుతః – చ్యుతి లేనివాడు, స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు, ఎట్టి వికారములు లేనివాడు, విష్ణుసహస్రనామములు శ్రీశంకరభాష్యంలో 100వ నామం, 318వ నామం}; త్రి = మూడు; శక్తిన్ = శక్తుల {త్రిశక్తులు - సృష్టి, స్థితి, లయములను మూడు శక్తులు}; యుక్తుఁడున్ = కూడినవాడు; అగుచున్ = అగుచూ; ఇంతకున్ = ఇంతకు; తానన్ = తానే; మూలము = మూలము; ఐ = అయి.

భావము:

ఆ దేవదేవుని ఆనతిని అనుసరించి, చరాచరప్రాణులతో గూడిన ఈ సృష్టిని నేను విస్తారంగా సృజిస్తున్నాను. ప్రభావసంపన్నుడైన విష్ణువు దీనిని పోషిస్తున్నాడు. పార్వతీనాథుడైన శివుడు దీనిని లయింప జేస్తున్నాడు. పద్మనాభుడు, మొదటి వేలుపు, అచ్యుతుడు అయిన శ్రీహరి సృష్టి స్థితిలయాల కన్నిటికి మూలహేతువై ఆ మూడు విధాలైన శక్తులతోనూ కూడి వుంటాడు.