పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : లోకంబులు పుట్టుట

 •  
 •  
 •  

2-91-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ర సురాసుర పితృ నాగ కుంజర మృగ-
గంధర్వ యక్ష రాక్షస మహీజ
సిద్ధ విద్యాధర జీమూత చారణ-
గ్రహ తారకాప్సరోణ విహంగ
భూత తటిద్వస్తు పుంజంబులును నీవు-
ముక్కంటియును మహామునులు నేను
లిలనభస్థ్సలరములు మొదలైన-
వివిధ జీవులతోడి విశ్వమెల్ల

2-91.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

విష్ణుమయము పుత్ర! వేయేల బ్రహ్మాండ
తని జేనలోన డఁగి యుండు;
బుద్ధి నెఱుఁగరాదు భూతభవద్భవ్య
లోకమెల్ల విష్ణులోన నుండు.


[ఈ క్రింది యధిక పాఠము మూలమున “సోమృతస్యాభయస్య” అనుట మొదలుకొని, “పురుషస్తాభయాశ్రయః” అనువఱకు గల నాలుగు శ్లోకములకును వానికి శ్రీధరులు రచించిన వ్యాఖ్యానమునకునుఁ దెనుఁగై యీ ఘట్టమున నుండవలసినదియే. అయిన నిది పెక్కు వ్రాఁతప్రతులను నచ్చుప్రతులనుఁ గాన రాదు. ఒకానొక వ్రాఁతప్రతి యందే చూపట్టుచున్నది. మఱియుఁ బోతన మూలమున శ్రీధరవ్యాఖ్యాన సహితముగాఁ దెనిగించినవాఁడు. కనుకఁ క్రింది నాలుగు శ్లోకములు పోతనకు లభించిన మూలమున లేకుండవచ్చు నని తలంచినను వాని వ్యాఖ్యానము నం దైనను దప్పక కనుపట్టి యుండును. గాన వానినిఁ దెనిఁగింపకుండడు. అయిన నీ తెనిఁగింపు పోతన దాని యంత సమంజసమును బ్రౌఢమును గాకున్నది. వెలిగందల నారయ కవిత్వ మిందును గొంత చేరి యుండుననియుఁ గనుకనే యిది పోతన రచన వలె సమంజసమును బ్రౌఢమును గాదయ్యె ననియు నూహింపఁ దగి యున్నది. - తంజనగరము - తేవప్పెరుమాల్లయ్య వారి ప్రచురణ
3) 2-91/1-క.

దోనొకకర్మఫల
ప్రాదుర్భావ మగు లోక పాలన కే
కా దేవుం డభయప్రతి
పాక మగు మోక్షమునకుఁ తి యె ట్లన్నన్.
4) 2-91/2-వ.
వినుము, పరమాత్మయు నానందేశ్వరుం డ(డున)గు నవ్విష్ణునకుఁ బ్రపంచమాత్రాధికత్వం బేమి యద్భుత మ ట్లగుటంజేసి, యతని మహిమాతిశయం బస్మదాదులు నెఱుంగనేర్తురె, స్థిత్యర్థపాదుం డగు నీశ్వరుని పాదాంశంబు లందు భూభువస్సువర్లోకంబులు గుదురుకొని యుండుఁ. దదీయ విలయ సమయంబునం దదుపరి మహర్లోకంబు దపియింప నందుఁ గల జనంబు లంతరాళంబు నందక మహర్లోకశిరఃస్థానం బైన జనలోకంబుఁ బ్రవేశించి యత్యంతం బగు నవినాశి సుఖంబు లనుభవింతురు. తపోలోకంబు సంకర్షణానల శక్తిచేత నధస్త్రిలోకంబులుం దందహ్యమానంబు లగు నప్పుడు తదూష్మలం జెందక విలక్షం బై, క్షేమంబు గలిమిఁ దజ్జనం బంద సుఖించు. జన్మజరామరణభయంబులు లేక ముక్తికిఁ బ్రత్యాసన్ను లగుటం జేసి సత్యలోకపువాసు లంద యానందింతురు. భూభువస్సువర్లోకంబు లవ్విరాట్పురుషుని పద స్థలం బగుట నేక పాద్విభూతి యయ్యె. మహర్లోకంబు మధ్యమవిభూతి యన నమరె. జన తపో సత్య లోకంబు లమ్మహాపురుషుని శిరఃస్థానంబు గావున, నది త్రిపాద్విభూతి యనంబడుఁ. దదీయ లోకంబు బ్రహ్మచర్య వానప్రస్థ యతులకు దక్క నితరుల కసాధ్యంబు. గృహస్థు లయ్యు నితర త్రివిధాశ్రమధర్మంబులు గలిగినం జేకుఱు. క్షేత్రజ్ఞుం డైన పురుషుండు స్వర్గాపవర్గ హేతుభూతం బైన దక్షిణోత్తర కర్మ జ్ఞాన మార్గంబులు సృజించి యంతయుఁ దాన యై యుండు.]


టీకా:

నర = మానవులు; సుర = దేవతలు; అసుర = దానవులు; పితృ = పితృదేవతలు; నాగ = నాగులు; కుంజర = ఏనుగులు; మృగ = లేళ్ళు; గంధర్వ = గంధర్వులు; యక్ష = యక్షులు; రాక్షస = రాక్షసులు; మహీజ = చెట్లు {మహీజ - మహి+జ - భూమిని పుట్టినవి - చెట్లు}; సిద్ధ = సిద్ధులు; విధ్యాధర = విధ్యాధరులు; జీమూత = మేఘములు; చారణ = చారణులు; గ్రహ = గ్రహములు; తార = తారకలు; అప్సరస = అప్సరసల; గణ = సమూహము; విహంగ = పక్షులు; భూత = భూతములు; తటి = తటిల్లతికలు, మెరుపులు; వస్తు = సంపదల; పుంజములును = కట్టలు, గుంపులు; నీవున్ = నీవు (నారద); ముక్కంటియున్ = శివుడును {ముక్కంటి - మూడు కన్నులు ఉన్నవాడు - శివుడు}; మహా = గొప్ప; మునులు = మునులు; నేను = నేను (బ్రహ్మ); సలిల = నీటిలో; నభస్ = ఆకాశములో; స్థల = భూమిపైన; చరములు = చరించునవి, జీవులు; మొదలైన = మొదలగు; వివధ = రకరకముల; జీవులన్ = ప్రాణులు; తోడిన్ = తోకూడిన; విశ్వము = జగత్తు; ఎల్లన్ = అంతయు;
విష్ణు = భగవంతునితో; మయము = మయమైనవే, కలిసిఉన్నవే; పుత్ర = కుమారుడ; వేయి = వేయి రకముల చెప్పుట; ఏల = ఎందులకు; బ్రహ్మాండము = బ్రహ్మాండమే; అతని = అతని; జేన = జేన {జేన - సాగదీసిన బొటకన వేలు చూపుడు వేలుల కొనల మధ్య దూరము}; లోనన్ = లోపల; అడఁగిన్ = అణగి, ఇమిడిపోయి; ఉండున్ = ఉండును; బుద్ధిన్ = ఆలోచనలతో; ఎఱుఁగన్ = తెలిసికొనుటకు; రాదు = వీలుకాదు; భూత = భూతకాలపు,; భవత్ = వర్తమానకాలపు; భవ్య = భవిష్యత్తుకాలపు; లోకమున్ = లోకములు; ఎల్లన్ = అన్నియును; విష్ణు = భగవంతుని; లోనన్ = లోపల; ఉండున్ = ఉండును.2

భావము:

ఓ కుమారా! మానవులూ, దేవతలూ, దానవులూ, పితరులూ, ఉరగులూ, గజాలూ, మృగాలూ, గంధర్వులూ, యక్షులూ, రాక్షసులూ, వృక్షాలూ, సిద్ధులూ, విద్యాధరులూ, మేఘాలూ, చారణులూ, గ్రహాలూ, నక్షత్రాలూ, అచ్చరలూ, పక్షులూ, భూతగణాలూ, మెరపులూ, కనకాది ధనరాసులూ, నీవూ, శివుడూ, మహర్షులూ, నేనూ నీళ్లలోనూ, ఆకాశంలోనూ, భూమిమీదా సంచరించే వివిధ ప్రాణులతో గూడిన ఈ ప్రపంచమూ – అంతా విష్ణుమయమే. వేయిమాట లెందుకు బ్రహ్మాండభాండాలన్నీ అతని జేనలో ఇమిడిపోతాయి. కేవలం బుద్ధిబలంతో మనం ఆ దేవదేవుని తెలిసికోలేము. కడచినవీ, ఇపుడున్నవీ, రానున్నవీ అయిన లోకాలన్నీ విష్ణువులోనే వున్నాయి.