పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మోక్షప్రదుండు శ్రీహరి

  •  
  •  
  •  

2-46-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవ పరాయణుండైన శుకుం డిట్లనియె.

టీకా:

అట్టి = అటువంటి; పరమ = ఉత్తమ; భాగవంతుండున్ = భాగవతానుయాయి; ఐన = అయినట్టి; పాండవేయున్ = పాండవ వంశస్థుని; కున్ = కి; వాసుదేవ = వసుదేవ పుత్రుని - కృష్ణుని; పరాయణుండు = ఉత్తమ గతిగా కలవాడు; ఐన = అయినట్టి; శుకుండున్ = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.

భావము:

అట్టి భాగవత శ్రేష్ఠుడైన పరీక్షిత్తుతో వాసుదేవ భక్తుడైన శుకముని ఇలా చెప్పాడు.