పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వితీయ స్కంధము : మోక్షప్రదుండు శ్రీహరి

  •  
  •  
  •  

2-42-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వ తాత్పర్యముతో నిటు
తాన్వయవిభుఁడు శుకుని లుకులు విని స
త్వతాయుతుఁడై శ్రేయ
స్కతామతి నేమి యడిగె? ణుతింపఁ గదే;

టీకా:

వర = శ్రేష్ఠమైన; తాత్పర్యము = భావము; తోన్ = తో; ఇటు = ఇక్కడ; భరత = భరత; అన్వయ = వంశోద్భవ; విభుఁడు = ప్రభువు (పరీక్షిత్తు); శుకుని = శుకుని; పలుకులు = భాషణములు; విని = విని; సత్వరత = ఆతురతతో; ఆయుతఁడు = కూడినవాడు; ఐ = అయి; శ్రేయస్ = శుభములు; కరతా = కలిగించు; మతిన్ = బుద్ధితో; ఏమి = ఏమి; అడిగెన్ = అడిగెను; గణుతింపన్ = ఎంచి వచింప; కదే = వలసినది.

భావము:

“శుకబ్రహ్మ ఈ విధంగా చెప్పిన మాటలు శ్రద్ధగా విన్న పరీక్షిత్తు, శ్రేయోభిలాషియై ఆతృతతో యేమని ప్రశ్నించాడో వివరంచవయ్య సూతా!