పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్ప ప్రళయ ప్రకారంబు

  •  
  •  
  •  

12-23.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నంతఁ గాలాగ్ని సంకర్షణాఖ్య మగుచు,
ఖిల దిక్కులు గలయంగ నాక్రమించు;
ట్టియెడ నూఱువర్షంబు లాదుకొనఁగ
వీఁకతోడుత వాయువుల్ వీచు నపుడు.

టీకా:

అంతన్ = అప్పుడు; లోకేశున్ = బ్రహ్మదేవుని; కున్ = కి; అవసానకాలంబు = అంతకాలము; వచ్చిన = రాగా; నూఱు = వంద (100); ఏండ్లు = సంవత్సరములు; వసుధ = భూలోకము; లోనన్ = అందు; వర్షంబులు = వానలు; ఉడిగినన్ = పడకపోవుటచేత; వడిన్ = బిగువు; తప్పి = వదలి; మానవుల్ = మానవులు; దప్పిన్ = దాహముచేత; ఆకటన్ = ఆకలిచేత; చిక్కి = కృశించి; నొప్పిన్ = బాధలు; ఒంది = పొంది; అన్యోన్య = ఒకరినొకరు; భక్షులు = తినువారు; ఐ = అయ్యి; ఆ = ఆ యొక్క; కాల = కాలమునకు; వశమునన్ = లొంగిపోయి; నాశమున్ = నాశనమును; ఒందెదరు = పొందెదరు; అంతన్ = అప్పుడు; నలినసఖుడు = సూర్యుడు {నలినసఖుడు - నలిన (పద్మములకు) సఖుడు (స్నేహితుడు), సూర్యుడు}; సాముద్ర = సముద్రములలోని; దైహిక = శరీరములందు; క్ష్మా = భూమియందు; జాత = కలిగిన; రసములన్ = ద్రవములను; చాతురిన్ = నేర్పుతో; కిరణ = కిరణముల; ఆవళి = సమూహముల; చేతన = చేత; కాల్పన్ = కాల్చివేయగా; అంతన్ = అప్పుటి; కాలాగ్ని = కాలాగ్ని.
సంకర్షణ = సంకర్షణము {సంకర్షణుడు - ప్రళయమందు సర్వులను సంహరించువాడు, విష్ణువు}; ఆఖ్య = పేరుగలది; అగుచున్ = ఔతూ; అఖిల = సర్వ; దిక్కులన్ = దిశలందు; కలయంగ = వ్యాపించి; ఆక్రమించున్ = ఆక్రమిస్తుంది; అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు; నూఱు = వంద (100); వర్షంబులు = సంవత్సరములు; ఆదుకొనగన్ = ముసురుకొనగా; వీక = విజృంభణము; తోడుత = తోటి; వాయువుల్ = గాలులు; వీచున్ = వీస్తాయి; అపుడు = అప్పుడు.

భావము:

బ్రహ్మదేవునికి అతని కాలమాన ప్రకారం వంద సంవత్సరాలు (365,000 యుగచతుష్టయములు) నిండితే ఒక అవసానకాలం వస్తుంది. అపుడు భూమిమీద నూరేళ్ళపాటు వానలు కురవవు. దానితో మానవులు ఆకలిదప్పులు తట్టుకోలేక అల్లాడిపోతారు. అప్పుడు ఒకరినొకరు తినడం మొదలు పెడతారు. ఆ విధంగా కాలవశులై అంతరిస్తారు. అప్పుడు పద్మబాంధవుడైన సూర్యుడు సముద్ర జలాలను, శరీరము లందున్న రసాలను, భూమి యందు ఉండు ద్రవాలను తన కిరణాలచేత కాల్చి పీల్చివేస్తాడు. ఆ విధమైన కాలాగ్ని సంకర్షణం అనే పేరుతో అన్నిదిక్కులలోనూ వ్యాపించి ఆక్రమిస్తుంది. అప్పుడు నూరు సంవత్సరాలపాటు విడవకుండా వాయువులు వీస్తాయి.