పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-9-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దిదినమును ధర్మంబులు,
యము ధర నడఁగిపోవు నాశ్చర్యముగా
విను వర్ణ చతుష్కములో;
నెయఁగ ధనవంతుఁ డైన నేలు ధరిత్రిన్.

టీకా:

దినదినము = రోజురోజుకి; ధర్మంబులు = ధర్మానుసరణలు; అనయమున్ = అంతకంతకు; ధరన్ = భూమండలమునందు; అడగిపోవున్ = అణిగిపోతాయి; ఆశ్చర్యముగా = ఆశ్చర్యకరముగా; విను = వినుము; వర్ణచతుష్కము = నాలుగుజాతులవారి {వర్ణచతుష్కము - 1బ్రాహ్మణ 2క్షత్రియ 3వైశ్య 4శూద్ర వర్ణములు, నాలుగు జాతులు}; లోన్ = అందు; ఎనయంగా = ఎంచిచూసిన; ధనవంతుడు = ధనికుడు; ఐనన్ = అయినచో; ఏలున్ = పరిపాలించును; ధరిత్రిన్ = రాజ్యామును.

భావము:

దానితో లోకంలో రోజురోజుకూ ధర్మం తగ్గిపోతుంది. నాలుగు కులాలలోనూ ధనవంతుడు అయినవాడే పాలకుడు అవుతాడు.