పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-19-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"త్తమశ్లోకుఁ డననెవ్వఁ డున్నవాడు;
న్నుతుండగు నెవ్వఁడు కల దిశల;
ట్టి పరమేశ్వరునిఁ జిత్తమందు నిలిపి
ద్గుణంబులు వర్ణింపు రణినాథ! "

టీకా:

ఉత్తమ = ఉత్తములచే; శ్లోకుండు = కీర్తనీయుడు; అనన్ = అనగా; ఎవ్వడు = ఎవరైతే; ఉన్నవాడు = ఉన్నాడో; సన్నుతుండు = స్తుతింపబడెడివాడు; అగున్ = అయిన; ఎవ్వడు = ఎవరో; సకల = సర్వ; దిశలన్ = దిక్కులందును; అట్టి = అటువంటి; పరమేశ్వరుని = భగవంతుని; చిత్తము = మనస్సు; అందున్ = లోపల; నిలిపి = నిల్పుకొని; తత్ = అతని; గుణంబులున్ = గుణములను; వర్ణింపు = కీర్తింపుము; ధరణీనాథ = రాజా.

భావము:

“ఓ మహారాజా! ఉత్తములచే కీర్తింపతగిన వాడు, సర్వదిక్కులలో స్తుతింపబడువాడు అయిన పరమేశ్వరుని మనసులో నిలుపుకొని అతని గుణాలను కీర్తించు.”