పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-16-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్మము సత్యముఁ గీర్తియు
నిర్మలదయ విష్ణుభక్తి నిరుపమ ఘన స
త్కర్మ మహింసావ్రతమును
ర్మిలి గలవారె పుణ్యు వనీనాథా!

టీకా:

ధర్మము = ధర్మము; సత్యము = సత్యము; కీర్తియున్ = కీర్తియు; నిర్మలదయ = స్వచ్ఛమైనదయ; విష్ణుభక్తి = విష్ణుభక్తి; నిరుపమ = సాటిలేని; ఘన = గొప్ప; సత్కర్మ = మంచిపనులు; అహింసావ్రతమును = అంహింసదీక్షపై; నర్మిలిన్ = ఆపేక్ష, కోరిక; కలవారె = ఉన్నవారే; పుణ్యులు = పుణ్యవంతులు; అవనీనాథ = రాజా.

భావము:

ఓ మహారాజా! ధర్మం, సత్యం, కీర్తి, నిర్మలమైన దయ, విష్ణుభక్తి, అనుపమ మహనీయ సత్కర్మ, అహింసావ్రతం అనే సుగుణాలు కలవారు మహా పుణ్యాత్ములు.