పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-14-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వర! తొంటి భూపతుల నామ గుణంబులు, వృత్తచిహ్నముల్,
సిరియును, రూప సంపదలుఁ, జెన్నగురాజ్యము, లాత్మవిత్తముల్
రుస నడంగెఁ గాని, యట వారల కీర్తులు నిర్మలంబులై
యువడి భూమిలో నిలిచి యున్నవి నేఁడును రాజశేఖరా!

టీకా:

నరవర = రాజా; తొంటి = పూర్వపు; భూపతుల = రాజుల; నామ = పేరు ప్రతిష్టలు; గుణంబులు = గుణగణాలు; వృత్త = నడవడికలు; చిహ్నముల్ = లక్షణములు; సిరియున్ = ఐశ్వర్యములు; రూప = అందచందాలు; సంపదలు = సంపదలు; చెన్నగు = చక్కటి; రాజ్యముల్ = రాజ్యాలు; ఆత్మవిత్తములు = ఆధ్యాత్మికఙ్ఞానసంపత్తి; వరుసన్ = క్రమముగా; అడంగెన్ = నశించినవి; కాని = కాని; అట = అక్కడ; వారల = వారి యొక్క; కీర్తులు = కీర్తి; నిర్మలంబులు = స్వచ్ఛములుగా; ఐ = అయ్యి; ఉరవడిన్ = అధికముగానే; భూమి = భూలోకము; లోన్ = అందు; నిలిచి = నిలబడి; ఉన్నవి = ఉన్నాయి; నేడునున్ = ఇవాళ్టికిని; రాజశేఖరా = మహారాజా.

భావము:

ఓ రాజోత్తమా! పూర్వరాజుల పేర్లు, గుణాలు, ప్రవర్తనచిహ్నాలు, సిరిసంపదలు, అందచందాలు, రాజ్యాలు, ఐశ్వర్యాలు సర్వం వరుసగా అణగారి పోయాయి. కాని వారి యశస్సులు ఈనాటికి కూడ ఎంతో ఎక్కువగా నిర్మలంగా ధాత్రిలో నిలచి ఉన్నాయి.