పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : కల్క్యవతారంబు

  •  
  •  
  •  

12-12-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మునినాథ! యే విధంబున
తరముగఁ జంద్ర సూర్య గ్రహముల జాడల్
నుఁ? గాలవర్తనక్రమ
మొరఁగ నెఱిఁగింపవయ్య ముదము దలిర్పన్."

టీకా:

ముని = మునులలో; నాథ = శ్రేష్ఠుడా; ఏ = ఏ; విధంబునన్ = లాగు; ఘనతరము = మిక్కిలిగొప్పగా {ఘనము - ఘనతరము - ఘనతమము}; చంద్ర = చంద్రగ్రహము; సూర్యగ్రహముల = సూర్యగ్రహముల; జాడన్ = సంచరించుమార్గాలు; చనున్ = ఉంటాయు; కాల = కాలము యొక్క; వర్తన = నడచెడి; క్రమమున్ = పద్ధతి; ఒనరగన్ = చక్కగా; ఎఱిగింపవు = తెలుపుము; అయ్య = తండ్రి; ముదము = సంతోషము; తలిర్పన్ = కలుగునట్లుగా.

భావము:

అప్పుడు పరీక్షిత్తు “మునివరా! చంద్రగ్రహం సూర్యగ్రహం సంచరించే మార్గాలు ఏవి? కాలవర్తన క్రమం ఏమిటి? నాకు చెప్తే సంతోషిస్తాను. నాకు చెప్తావా?” అని అడిగాడు