పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్వాదశ స్కంధము : పూర్ణి

 •  
 •  
 •  

12-52-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కసుతాహృచ్చోరా!
కవచోలబ్ధవిపినశైలవిహారా!
కామితమందారా!
నాదికనిత్యదుఃఖయసంహారా!

టీకా:

జనకసుతాహృచ్చోరా = శ్రీరామా {జనకసుతాహృచ్చోరుడు - జనకుని పుత్రిక (సీత) హృదయము దొంగిలించినవాడు, రాముడు}; జనకవచోలబ్ధవిపినశైలవిహారా = శ్రీరామా {జనకవచోలబ్ధవిపినశైలవిహారుడు - తండ్రి మాటవల్ల లభించిన అరణ్యాలలో పర్వతాలలో సంచారము కలవాడు, రాముడు}; జనకామితమందారా = శ్రీరామా {జనకామితమందార - ప్రజల కామితములు తీర్చు కల్పవృక్షము వంటివాడు, రాముడు}; జననాదికనిత్యదుఃఖచయసంహారా = శ్రీరామా {జననాదికనిత్యదుఃఖచయసంహారుడు - పుట్టుక మొదలైన నిత్యము కలిగెడి దుఖ సముదాయములను తొలగించువాడు, రాముడు}.

భావము:

జనకమహారాజు పుత్రిక సీతాదేవి మనసు దోచుకున్న ఆదర్శ భర్తవు. తండ్రి మాట నిలబెట్టడం కోసం కొండకోనలలో తిరిగి కష్టాలు అనుభవించిన ఆదర్శ పుత్రుడవు. ప్రజల కోరికలను తీర్చుటలో కల్పవృక్షము వంటి ఉత్తమ పాలకుడవు. పునర్జన్మ మున్నగు విడువరానిదుఃఖా లన్నిటిని తొలగించే భగవంతుడవు. అయినట్టి శ్రీరామచంద్రప్రభూ! నీకిదే వందనం.

12-53-మాలి.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

దవనవిహారీ! త్రులోకప్రహారీ!
సుగుణవనవిహారీ! సుందరీమానహారీ!
వితకలుషపోషీ! వీరవర్యాభిలాషీ!
స్వగురుహృదయతోషీ! ర్వదాసత్యభాషీ!

టీకా:

జగదవనవిహారీ = శ్రీరామా {జగదవనవిహారుడు - జగత్తును అవన (రక్షించుట)కై విహరించువాడు, రాముడు}; శత్రులోకప్రహారీ = శ్రీరామా {శత్రులోకప్రహారుడు - శత్రువుల సమూహమును సంహరించువాడు, రాముడు}; సుగుణవనవిహారీ = శ్రీరామా {సుగుణవనవిహారుడు - సుగుణములు అనెడి వనమున విహరించువాడు, రాముడు}; సుందరీమానహారీ = శ్రీరామా {సుందరీమానహారుడు - అందగత్తెల అభిమానమును హరించువాడు, రాముడు}; విగతకలుషపోషీ = శ్రీరామా {విగతకలుషపోషుడు - విగతకలుష (కళంకరహితులను) పోషించువాడు, రాముడు}; వీరవర్యాభిలాషీ = శ్రీరామా {వీరవర్యాభిలాషుడు - వీరవర్యులచేత అభిలషింపదగినవాడు, రాముడు}; స్వగురుహృదయతోషీ = శ్రీరామా {స్వగురుహృదయతోషుడు - తన గురువునకు సంతోషము కలిగించువాడు, రాముడు}; సర్వదాసత్యభాషీ = శ్రీరామా {సర్వదాసత్యభాషి - ఎల్లప్పుడు సత్యమే పలుకు వాడు, రాముడు}.

భావము:

శ్రీరామా! లోకరక్షణకై విహరించే వాడా! శత్రువులను ప్రహరించే వాడ! సుగుణాలవనంలో విహరించే వాడా! అందగత్తెల అభిమానాన్ని దోచుకొనే వాడా! కళంకరహితులను పోషించే వాడా! వీరవరులచేత అభిలషింపబడే వాడా! స్వీయగురువు యొక్క మనస్సుకు సంతోషం కలిగించిన వాడా! ఎల్లప్పుడు సత్యమే పలికేవాడా! నీకు నమస్కారం.

12-54-గ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇది శ్రీ పరమేశ్వరకరుణాకలిత కవితావిచిత్ర కేసనమంత్రిపుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రియశిష్య వెలిగందల నారయ నామధేయ ప్రణీతంబైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబు నందు రాజుల యుత్పత్తియు, వాసుదేవ లీలావతార ప్రకారంబును, గలియుగధర్మ ప్రకారంబును, బ్రహ్మప్రళయ ప్రకారంబును, బ్రళయ విశేషంబులును, దక్షకునిచే దష్టుండై పరీక్షిన్మహారాజు మృతినొందుటయు, సర్పయాగం బును, వేదవిభాగక్రమంబును, బురాణానుక్రమణికయు, మార్కండేయో పాఖ్యానంబును, సూర్యుండు ప్రతిమాసంబును వేర్వేఱు నామంబుల వేర్వేఱు పరిజనంబులతో జేరుకొని సంచరించు క్రమంబును, తత్తత్పు రాణగ్రంథసంఖ్యలు నను కథలుగల ద్వాదశస్కంధము, శ్రీమహాభాగవత గ్రంథము సమాప్తము.

టీకా:

ఇది = ఇది; శ్రీ = శోభనుడైన; పరమేశ్వర = భగవంతుని; కరుణా = దయచేత; కలిత = లభించిన; కవితా = కవిత్వము చెప్పుటలో; విచిత్ర = విచిత్రమైన నేర్పుగలవాడు; కేసనమంత్రి = కేసనమంత్రి యొక్క; పుత్ర = పుత్రుడు; సహజ = సహజసిద్ధముగనే; పాండిత్య = పాండిత్యము అబ్బినవాడు; పోతన = పోతన యనెడి; అమాత్య = అమాత్యుడు యొక్క; ప్రియ = ఇష్ట; శిష్య = శిష్యుడు; వెలిగందల = వెలిగందల; నారాయ = నారాయ అను; నామధేయ = పేరుగలవానిచే; ప్రణీతంబు = సంస్కరింపబడినది; ఐన = అయినట్టి; శ్రీ = శుభకరమైన; మహాభాగవతంబు = మహాభాగవతము; అను = అనెడి; మహా = గొప్ప; పురాణంబున్ = పురాణము; అందున్ = లో; రాజుల = రాజుల యొక్క; ఉత్పత్తియున్ = పుట్టుక; వాసుదేవ = వాసుదేవుని; లీలావతార = అవతారముల; ప్రకారంబును = వివరములు; కలియుగ = కలియుగమునందలి; ధర్మ = ధర్మము; ప్రకారంబును = విధము; బ్రహ్మప్రళయ = బ్రహ్మప్రళయముల; ప్రకారంబును = విధములు; ప్రళయ = ప్రళయముల; విశేషంబులును = విశేషాలు; తక్షకుని = తక్షకుడి; చేన్ = చేత; దష్టుండు = కాటువేయబడినవాడు; ఐ = అయ్యి; పరీక్షిత్ = పరీక్షిత్తు; మహారాజు = మహారాజు; మృతినొందుటయు = చనిపోవుట; సర్పయాగంబును = సర్పయాగము; వేద = వేదముల; విభాగ = భాగములయొక్క; క్రమంబునున్ = వివరములు; పురాణ = పురాణముల యొక్క; అనుక్రమణిక = జాబతా; మార్కండేయోపాఖ్యానంబును = మార్కండేయోపాఖ్యానము; సూర్యుండు = సూర్యుడు; ప్రతి = ప్రతియొక్క; మాసంబునన్ = నెలలోను; వేర్వేఱు = భిన్న; నామంబులన్ = పేర్లతో; వేర్వేఱు = భిన్నమైన; పరిజనంబుల = సేవకుల; తోన్ = తోటి; చేరుకొని = కూడి; సంచరించు = నడచెడి; క్రమంబునున్ = విధములు; తత్ = ఆయా; పురాణ = పురాణముల యొక్క; గ్రంథసంఖ్యలును = శ్లోకముల లెక్కలు; అను = అనెడి; కథలు = కథలు; కల = ఉన్నట్టి; ద్వాదశ = పన్నెండవ; స్కంధము = స్కంధము మరియు; శ్రీ = శుభకరమైన; మహాభాగవత = మహాభాగవతము అను; గ్రంథము = గ్రంథము; సమాప్తము = పూర్తి చేయబడినది.

భావము:

ఇది శ్రీ పరమేశ్వరకరుణచేత సంప్రాప్తించిన కవిత్వ వైచిత్రి కల కేసనమంత్రి పుత్రుడు; సహజ పాండిత్యుడైన పోతనామాత్యుని ప్రియశిష్యుడు అయిన వెలిగందల నారాయణ పేరుగలవాని చేత లిఖించబడిన శ్రీమహాభాగవతం అనే మహా పురాణంలో రాజుల పుట్టుక; వాసుదేవుని లీలావతార భేదములు; కలియుగ ధర్మప్రకారము; బ్రహ్మప్రళయ విశేషాలు; తక్షకుడు కరవడంచేత పరీక్షన్మహారాజు పరమపదించడము; సర్పయాగము; వేదవిభాగ క్రమము; పురాణానుక్రమణిక; మార్కండేయోపాఖ్యానము; మాసవారీ సూర్యుడు భిన్న నామాలుతో, భిన్న పరిజనులుతో సంచరించే క్రమము; అష్టాదశ పురాణాల పరిమాణము అనే కథలు కల ద్వాదశ స్కంధాలు గల శ్రీమహాభాగవత గ్రంథం సమాప్తం.

ఓం నమో భగవతే వాసుదేవాయ!!
ఓం! ఓం! ఓం!
ఓం! శాంతిః! శాంతిః! శాంతిః!
సర్వే జనా స్సుఖినో భవతు!!