పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : అంతరిక్షు సంభాషణ

  •  
  •  
  •  

11-51-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మబ్రహ్మ మనంగాఁ,
తత్త్వ మనంగఁ, బరమద మనఁగను, నీ
శ్వరుఁ డనఁ, గృష్ణుఁ డన, జగ
ద్భరితుఁడు, నారాయణుండు దా వెలుఁగొందున్‌.

టీకా:

పరమబ్రహ్మము = పరబ్రహ్మము; అనంగా = అని; పరమతత్వము = పరమతత్వము; అనంగ = అని; పరమపదము = పరమపదము; అనగనున్ = అని; ఈశ్వరుడు = పరమేశ్వరుడు; అనన్ = అని; కృష్ణుడు = కృష్ణుడు; అనన్ = అని; జగద్భరితుడు = లోకాలను భరించువాడు; నారాయణుండు = విష్ణుమూర్తి; తాన్ = అతను; వెలుగొందున్ = ప్రకాశించును.

భావము:

“పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.