పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : హరిముని సంభాషణ

  •  
  •  
  •  

11-47-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ర్ణాశ్రమధర్మంబుల
నిర్ణయకర్మములఁ జెడక నిఖిలజగత్సం
పూర్ణుఁడు హరి యను నాతఁడె
ర్ణింపఁగ భాగవతుఁడు సుధాధీశా!

టీకా:

వర్ణ = చతుర్వర్ణముల; ఆశ్రమ = చతురాశ్రముల; ధర్మంబులు = ధర్మములు; నిర్ణయ = సూత్రములు; కర్మములన్ = కర్మలు అందు; చెడక = మునిగిపోకుండ; నిఖిల = సమస్తమైన; జగత్ = లోకాల; సంపూర్ణుడు = నిండిపోయినవాడు; హరి = విష్ణువు; అనునాతడె = అతనే; వర్ణింపగన్ = స్తుతించుటకు; భాగవతుడు = భాగవతుడు; వసుధాధీశ = రాజా.

భావము:

ఓ మహా రాజా విదేహ! భాగవంతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు.