పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ఏకాదశ స్కంధము : కవి సంభాషణ

  •  
  •  
  •  

11-42-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణత్రయంబు చేతను
రుఁడే కర్మంబు సేయు య్యైవేళన్‌
రి కర్పణ మని పలుకుట
రువడి సుజ్ఞాన మండ్రు రమమునీంద్రుల్‌.

టీకా:

కరణత్రయంబు = మనోవాక్కాయకర్మల {కరణత్రయము - త్రికరణములు 1మనస్సు 2వాక్కు 3కాయము}; చేతను = చేత; నరుడు = మానవుడు; ఏ = ఏదైనాసరే; కర్మంబున్ = పని; చేయున్ = చేయునో; అయ్యై = ఆయా; వేళన్ = సమయములందు; హరి = నారాయణుని; కున్ = కు; అర్పణము = సమర్పిస్తున్నా; అని = అని; పలుకుట = పలకుట; పరువడి = మిక్కిలి; సుఙ్ఞానము = మంచి ఙ్ఞానము; అండ్రు = అంటారు; పరమ = మహా; ముని = ఋషులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు.

భావము:

త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు.